Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంత్రి లోకేశ్‌తో ఆసియా క్రీడల స్వర్ణ విజేత జ్యోతి సురేఖ భేటీ

మంత్రి లోకేశ్‌తో ఆసియా క్రీడల స్వర్ణ విజేత జ్యోతి సురేఖ భేటీ

వార్త 2 weeks ago

Vennam Jyothi Surekha: అంతర్జాతీయ వేదికలపై అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ దేశం గర్వించదగ్గ రీతిలో రాణిస్తున్న ప్రముఖ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ సోమవారం రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు.

ఉండవల్లిలోని మంత్రి నివాసంలో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో జ్యోతి సురేఖ వెంట ఆమె తండ్రి సురేంద్ర కుమార్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో ఆమె సాధించిన ఘనతలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఏషియన్ గేమ్స్-2026 స్వర్ణ విజేతగా అరుదైన రికార్డు

జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్-2026 ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన జ్యోతి సురేఖ ప్రతిభను మంత్రి లోకేశ్ కొనియాడారు. అంతర్జాతీయ వేదికపై భారత్ మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారని ప్రశంసించారు. ఏషియన్ గేమ్స్ చరిత్రలో ఇప్పటివరకు నాలుగు స్వర్ణ పతకాలతో కలిపి మొత్తం ఆరు పతకాలను తన ఖాతాలో వేసుకోవడం ద్వారా ఆమె అరుదైన మైలురాయిని అధిగమించారని కొనియాడారు.

Vennam Jyothi Surekha: 2028 ఒలింపిక్స్‌ లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపు

యువ క్రీడాకారులకు జ్యోతి సురేఖ పట్టుదల, నిలకడైన ప్రదర్శన ఎంతో స్ఫూర్తిదాయకమని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆమె భవిష్యత్ లక్ష్యాలపై చర్చించారు. రాబోయే 2028 ఒలింపిక్ గేమ్స్‌లో పతకం సాధించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ క్రీడా ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలు, అండదండలు ఉంటాయని మంత్రి స్పష్టమైన భరోసా ఇచ్చారు.

Epaper: epaper.vaartha.com

ఏపీ పింఛన్ల పంపిణీ లో కొత్త మార్పు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha