Nara Lokesh OSD: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వద్ద ప్రత్యేక అధికారిగా (OSD) సేవలందిస్తున్న డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్ విద్యా రంగంలో అరుదైన రికార్డు సృష్టించారు.
ఆర్థిక శాస్త్రం (Economics) లో ఆయన చేసిన అత్యుత్తమ పీహెచ్‌డీ పరిశోధనకు గాను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) రెండు ప్రతిష్టాత్మక స్వర్ణ పతకాలను ప్రకటించింది.
Dr Kasireddy Varaprasad
గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం
తిరుపతి ఎస్‌వీయూ ప్రాంగణంలో ఘనంగా జరిగిన 63 నుంచి 68వ ఉమ్మడి స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా డాక్టర్ వరప్రసాద్ ‘డాక్టర్ మన్మోహన్ సింగ్ గోల్డ్ మెడల్’ తో పాటు ‘ప్రొఫెసర్ డీఎల్ నారాయణ మెమోరియల్ పీహెచ్‌డీ గోల్డ్ మెడల్’ లంభించాయి.
Read also: YS Jagan: వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి: జగన్
Nara Lokesh OSD: మున్సిపల్ బాండ్లపై పరిశోధన
పట్టణ ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ డాక్టర్ వరప్రసాద్ తన పరిశోధన గ్రంథాన్ని రూపొందించారు. నగరాల్లో రోడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ‘మున్సిపల్ బాండ్ల’ ద్వారా నిధులను ఎలా సమీకరించవచ్చనే అంశంపై ఆయన విస్తృత పరిశోధన చేశారు. ఈ బాండ్ల విధానం ద్వారా అటు ప్రభుత్వాలకు ఆర్థిక వెసులుబాటు, ఇటు పెట్టుబడిదారులకు లాభసాటిగా ఉండేలా ఎలాంటి విధానపరమైన మార్పులు చేయాలో తన థీసిస్‌లో ఆయన సవివరంగా విశ్లేషించారు.
ఆర్థిక నిపుణుడిగా ప్రస్థానం.. గతంలో సస్పెన్షన్
డాక్టర్ వరప్రసాద్ అసలు వృత్తిరీత్యా రాష్ట్ర ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన డిప్యూటేషన్‌పై మంత్రి నారా లోకేశ్ కార్యాలయంలో ఓఎస్డీగా బాధ్యతలు చూస్తున్నారు.
ఆయనకు ప్రభుత్వ బడ్జెట్ రూపకల్పన, ఆర్థిక వ్యవహారాలపై సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో (CMO) కీలక బాధ్యతలు నిర్వర్తించి ఆర్థిక నిపుణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులకు సంబంధించిన గణాంకాలు మీడియాకు లీక్ అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరుణంలో ఆయనపై ఉన్న సస్పెన్షన్ వేటు తొలగిపోవడంతో మళ్లీ విధుల్లో చేరారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

