Mulugu : ములుగు జిల్లా ఏటూరునాగారంలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక ఉన్నత పాఠశాల (ట్రైబల్ వెల్ఫేర్) బాలికల హాస్టల్లో పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యం కనీస సదుపాయాలు లేక విద్యార్థినులు నరకయాతన అనుభవిస్తున్నారు.
హాస్టల్లో సరైన మంచినీటి సదుపాయం లేకపోవడంతో, స్నానానికి ఉపయోగించే నీటినే తాగడానికి కూడా వాడుకోవాల్సి వస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రోజూ పెట్టే టిఫిన్లలో పురుగులు వస్తున్నాయని, వాష్రూమ్‌లు అత్యంత అధ్వానంగా ఉండి కనీసం అడుగుపెట్టలేని స్థితిలో ఉన్నాయని వారు కంటతడి పెట్టుకున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సొంత నియోజకవర్గంలోనే విద్యార్థినులకు ఈ దుస్థితి ఎదురవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
mnistersithakkaవార్డెన్ వేధింపులపై గిరిజన బాలికల ఆగ్రహం
సమస్యల నిలయంగా మారిన హాస్టల్ తీరుపై నిలదీసిన విద్యార్థినులకు అధికారుల నుంచి వేధింపులే ఎదురవుతున్నాయి. వసతుల గురించి వార్డెన్‌ను ప్రశ్నిస్తే సహాయం చేయాల్సింది పోయి, తమను అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ, భౌతికంగా దాడి చేస్తున్నారని విద్యార్థినులు వాపోయారు. ఇక ఓర్పు నశించిన బాలికలు రోడ్డెక్కి తమ ఆవేదనను వెళ్లగక్కారు. మంత్రితో పాటు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హాస్టల్లో తాగునీరు, నాణ్యమైన ఆహారం మరియు పరిశుభ్రమైన వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత: కేటీఆర్, హరీశ్‌రావుల అరెస్ట్!

