AP weather update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. రానున్న కొద్ది గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
వాతావరణంలో వస్తున్న వేగవంతమైన మార్పుల నేపథ్యంలో అధికారులు ఈ మేరకు 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించారు.
Read also: Telangana weather update:తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాలు జాగ్రత్త!
Rain expected in several districts of the state shortly.
AP weather update: వర్ష సూచన ఉన్న జిల్లాలు ఇవే..
ఏపీఎస్డీఎంఏ (APSDMA) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ క్రింది జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది:
- విజయనగరం
- అల్లూరి సీతారామరాజు జిల్లా
- పార్వతీపురం మన్యం
- అనకాపల్లి
- కాకినాడ
- ఏలూరు
- పోలవరం పరిసర ప్రాంతాలు
గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు.. ప్రజలు అప్రమత్తం!
వర్షంతో పాటు ఆయా ప్రాంతాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాతావరణం ప్రమాదకరంగా మారే సూచనలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వర్షం పడే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని, చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల సమీపంలో గానీ ఆశ్రయం పొందకూడదని అధికారులు గట్టిగా హెచ్చరించారు.

