Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాలు జాగ్రత్త!

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాలు జాగ్రత్త!

వార్త 5 days ago

Telangana weather update: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ మేరకు ఆయా జిల్లాల యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేసింది.

Read also: Nizamabad News: విధుల్లో ఉండగానే గుండెపోటు.. నిజామాబాద్‌లో హెడ్ కానిస్టేబుల్ మృతి

 Rain forecast for Telangana… Heavy rains expected in those districts over the next two hours!

Telangana weather update: వర్ష సూచన ఉన్న జిల్లాలు ఇవే..

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని దాదాపు 18 జిల్లాల్లో రానున్న కొద్ది గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.

  • సిద్దిపేట, జనగామ, హన్మకొండ
  • సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి
  • వికారాబాద్, మెదక్, యాదాద్రి-భువనగిరి
  • మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్
  • నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నల్గొండ
  • ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల

అక్కడక్కడా చెదురుమదురు వానలు

ఈ ప్రధాన జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా వాతావరణం చల్లబడి, అక్కడక్కడా చెదురుమదురుగా వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షం పడే సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, చెట్ల కింద నిలబడవద్దని సూచించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

R&B శాఖలో సంచలనం రేపిన ఏసీబీ దాడులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha