Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరో 18 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించిన కవిత!

మరో 18 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించిన కవిత!

వార్త 2 weeks ago

Telangana Rakshana Sena: తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత సంస్థాగత నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణంలో భాగంగా మరో 18 కీలక అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు పార్టీ ఇంఛార్జ్‌ల నియామక ప్రక్రియ పూర్తయినట్లయింది.

Read Also :KTR : నా PRO, PAపై దాడి వెనక సీఎం హస్తం ఉంది : KTR

హైదరాబాద్ నుంచి పల్లెల వరకు కమిటీల కసరత్తు

  • గ్రేటర్ హైదరాబాద్‌పై ఫోకస్: రానున్న జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నగర పరిధిలోని పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, నాంపల్లి, అంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం స్థానాలకు నూతన ఇంఛార్జ్‌లను ఖరారు చేశారు.
  • ఉత్తర & దక్షిణ తెలంగాణ ప్రాతినిధ్యం: ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఖానాపూర్, నిర్మల్‌లతో పాటు.. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, హుజూరాబాద్, దేవరకొండ, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు.
  • మెదక్ లోక్‌సభ స్థానానికి ఇంఛార్జ్: పార్లమెంట్ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు మెదక్ లోక్‌సభ ఇంఛార్జ్‌గా మద్ది శ్రీనివాస్ రెడ్డి పేరును ఖరారు చేశారు.

Telangana Rakshana Sena: జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల ఖరారు

కేవలం నియోజకవర్గాలకే పరిమితం కాకుండా జిల్లాల వారీగా నూతన అధ్యక్షులను, అనుబంధ విభాగాల బాధ్యులను కవిత ప్రకటిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పటిష్టమైన సంస్థాగత పునాదిని నిర్మించడమే లక్ష్యంగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేలా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

తెలంగాణ ప్రజలకు KCR క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha