Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ ప్రజలకు KCR క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్

తెలంగాణ ప్రజలకు KCR క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్

వార్త 2 weeks ago

KCR : తెలంగాణ నీటి హక్కులను కాలరాశారని, ఇందుకుగాను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు.

నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ రాజకీయంగా కుమ్మక్కై, తెలంగాణ ప్రయోజనాలను పక్కనబెట్టారని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వేగంగా ప్రారంభించడానికి కేసీఆర్ ప్రభుత్వం పరోక్షంగా పూర్తి సహకారం అందించిందని, ఈ చారిత్రక తప్పిదం వల్లే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడం వల్ల ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏపీ ప్రభుత్వం ప్రతిరోజూ దాదాపు 10 టీఎంసీల నీటిని తరలించుకుపోతోందని మంత్రి కోమటిరెడ్డి వివరించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ నిర్లక్ష్యం మరియు స్వార్థ రాజకీయ పాపం వల్లే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన చట్టబద్ధమైన నీటి వాటాను, హక్కులను రాష్ట్రం తీవ్రంగా కోల్పోవాల్సి వచ్చిందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ చేసిన ఈ తప్పిదం వల్ల దక్షిణ తెలంగాణ జిల్లాలు సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి దాపురించిందని, ఇప్పటికైనా తన తప్పును ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.

బేగంబజార్‌లో డైమండ్ గణపతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha