Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న టీవీకే అధినేత విజయ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లిన సమయంలో అనుసరించిన విధానంపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also : మరో వారంలో పెట్రోల్ ధరలు పెరగనున్నాయా ?
Tamil Nadu: TVK chief Vijay in another controversy
అసలేం జరిగింది?
శుక్రవారం నాడు ‘జన నాయగన్’ సినిమా ప్రొడ్యూసర్ విజయ్‌తో భేటీ అయ్యారు. అనంతరం విజయ్ తన మద్దతుదారు పార్టీల నేతలతో కలిసి గవర్నర్‌ను కలిసేందుకు లోక్‌భవన్‌కు వెళ్లారు. అయితే, ఆ సమయంలో ప్రొడ్యూసర్ కూడా విజయ్ వెంటే ఉండటం, గవర్నర్‌కు మద్దతు లేఖ సమర్పించేటప్పుడు ఆయన పక్కనే నిల్చోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రొటోకాల్ ఉల్లంఘనపై విమర్శలు
ఈ పరిణామంపై రాజకీయ ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు వంటి అత్యంత కీలకమైన రాజకీయ ప్రక్రియలో ఒక సినిమా ప్రొడ్యూసర్‌ను వెంట తీసుకెళ్లడం ప్రొటోకాల్‌కు విరుద్ధమని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు చర్చల్లో ప్రొడ్యూసర్ పాత్ర ఏమిటని, ఆయనను లోక్‌భవన్‌కు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. వామపక్ష పార్టీలు విజయ్‌కు మద్దతు తెలపడం వెనుక సదరు ప్రొడ్యూసర్ ద్వారా భారీగా డబ్బు పంపిణీ జరిగి ఉండవచ్చని ప్రత్యర్థి పార్టీల నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైన సమయంలో ఈ ‘ప్రొడ్యూసర్ వివాదం’ విజయ్‌కు తలనొప్పిగా మారింది. దీనిపై టీవీకే శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

