Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరోసారి వాహనదారులకు షాక్ తప్పదా ?

మరోసారి వాహనదారులకు షాక్ తప్పదా ?

వార్త 1 week ago

దేశంలోని వాహనదారులకు ఇంధన ధరల సెగ మరోసారి గట్టిగా తగిలేలా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాలో అంతరాయాల కారణంగా ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటి స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో రాబోయే 2 నుండి 3 వారాల వ్యవధిలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.10 చొప్పున పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ‘ఎమ్‌కే గ్లోబల్’ (Emkay Global) తన తాజా నివేదికలో విశ్లేషించింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఈ పెంపు అనివార్యంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also : మే 23 నుండి బెంగళూరు - ముంబై కొత్త రైలు ప్రారంభం!

చమురు సంస్థలకు భారీ నష్టాలు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ఇంధన ధరలను దీర్ఘకాలంగా నియంత్రించడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం చమురు సంస్థలు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై దాదాపు రూ.17 నుండి రూ.18 వరకు నష్టపోతున్నాయని ఎమ్‌కే గ్లోబల్ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వం గతంలో ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి ముందు అది సరిపోవడం లేదు. ఈ నష్టాల తీవ్రతను తగ్గించేందుకు గాను, లీటర్‌కు రూ.10 చొప్పున పెంచడం ద్వారా కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రస్తుత నష్టాల్లో కనీసం 50 శాతానికి పైగా రికవరీ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకేసారి లేదా దశల వారీగా వాత.. సామాన్యుడి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం!

ఈ ఇంధన ధరల పెంపు అనేది ఒకేసారి భారీగా కాకుండా, ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రాకుండా ఉండేందుకు దశల వారీగా (Staggered manner) కొన్ని వారాల పాటు పెంచే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అయితే చమురు ధరల పెంపు ప్రభావం కేవలం వాహనదారులపైనే కాకుండా, రవాణా ఖర్చులు పెరగడం ద్వారా నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయల ధరలపై కూడా పడనుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం (Inflation) మరో 75 బేసిస్ పాయింట్ల వరకు పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమూల్, మదర్ డెయిరీ వంటి సంస్థలు పాల ధరలను పెంచగా, ఇప్పుడు ఇంధన ధరలు కూడా తోడైతే సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha