Fishermen : కొందరు మత్స్యకారులు లైసెన్స్, రిజిస్ట్రేషన్లు వంటివి సరిగా లేకుండానే చేపల వేటకు వెళుతూఉన్నారు. బైక్, కారు, లారీ ఇలా వాహనం ఏదైనా నడపాలంటే లైసెన్స్ ఉండాలి.
టూ వీలర్ అయితే వాల్మెట్ ధరించాలి. కారు నడిపితే సీటు బెల్ట్ పెట్టుకోవాలి. ప్రమాదం జరిగితే ఆర్థికంగా నష్టపోకుండా తప్పనిసరిగా బీమా తీసుకోవాలి. వీటిలో ఏది లేకపోయినా అధికారులు జరిమానా వేస్తారు. ఇందుకోసం రహదారులపై ఎక్కడికక్కడ పోలీసులు కాపు కాసి తనిఖీలు చేస్తుంటారు. మరి సముద్రంలో చేపల వేటకు వెళ్లే సమయంలో బోటు యజమానులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, వాటిని పాటిస్తున్నారా?, లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశాఖ జిల్లా గంగవరం పోర్టు సమీపాన ఈ నెల మొదటి వారంలో బోటు మునిగిపోయి అరుగురు మత్స్యకారులు మరణిం చారు. బోటు యజమాని ఒక్కడే బతికి బయటపడ్డాడు. ప్రభుత్వం తనకు ఏమీ సాయం చేయలేదని, చనిపోయిన కుటుంబాలకే రూ.10 లక్షల నష్టపరిహారం ఇచ్చిందని వాపోతున్నారు.
fishermen
fishermen : లైసెన్స్ తీసుకోవాలి
నిన్నటికి నిన్న ఓ బోటు బ్రేక్ వాటర్స్ సమీపాన బోల్తాపడింది. ఇద్దరు గాయపడ్డారు. తమకు బోటుకు రూ.2 లక్షలు, వలకు రూ.2.5 లక్షల నష్టం జరిగిందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ (ఏపీఎంఎస్ఆర్) చట్టం ప్రకారం సముద్రంలో చేపల వేటకు వెళ్లే ప్రతి బోటు తప్పనిసరిగా మత్స్య శాఖ అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. లైసెన్స్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.25 మాత్రమే. లైసెన్స్ ఫీజు రూ.50, నిబంధనల ప్రకారం రెన్యువల్ చేయించుకోవాలి. వేటకు వెళ్లే ప్రతిసారి ముందుగా సమీపంలోని సాగర మిత్రకు సమాచారం ఇవ్వాలి. ఏ బోటు వేటకు వెళుతుం ది?, ఎంతమంది (పేర్లతో సహా) వెళుతున్నారు?, ఏ దిక్కున వెళుతున్నారు?, ఎంత ఆయిల్ పోయించుకొని వెళుతు న్నారు? అనే వివరాలు అందించాలి. వేటకు వెళ్లే బోటు ఫిట్గా ఉందని సర్టిఫై చేయించుకోవాలి. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, సర్వేయర్ సంయుక్తంగా బోటునుతనిఖీ చేసి, బాగుందని, వేటకు అనువైనదని, అందులో అన్నీ ఉన్నాయని సర్టిఫై చేస్తేనే రెన్యువల్ చేస్తారు. అప్పుడే అది వేటకు వెళ్లాలి. ప్రతి బోటులో ఎంత మంది ఉంటే అంత మందికి ప్రమాదంలో ఉపకరించే లైఫ్ జాకెట్లు. అగ్నిప్రమా దం సంభవిస్తే నివారించడానికి ఫైర్కెటింగ్ ఎక్విప్మెంట్, బీమా పత్రాలు ఉండాలి. విశాఖపట్నంలో లక్ష రూపాయల నుంచి రూ.50 లక్షల వరకు ఖరీదు చేసే బోట్లు చేపల వేటకు వెళుతున్నాయి.
fishermen
తనిఖీ చేయడం లేదు
చాలామంది పాత బోట్లను కేరళ, తమిళనాడు ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ వేటకు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించడం లేదు. రోడ్లపై వాహనాలను తనిఖీ చేసినట్టు హార్బర్లో బోట్లను ఎవరూ తనిఖీ చేయడం లేదు. అక్కడ కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. సంఘాల నాయకులు తనిఖీలుజరగకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. తోటి మత్స్య కారులకు ప్రాణాపాయం అని తెలిసినా అధికారులకు సహ కరించడం లేదని ఈత వచ్చునని, గంగమ్మ ఒడిలో పెరిగా మని, ఏ నష్టం జరగదని సమర్ధించుకుంటున్నారు. బీమా చేయించుకున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే కంపెనీయే నష్టపరిహారం ఇస్తుంది. ఆ దిశగా కూడా వారికి హితబోధ చేయడం లేదు. ఇకనైనా బోటుయజమానులు నిబంధనలు పాటించేలా చూడాలి. మత్స్యకారులకు లైఫ్ జాకెట్లు లేకుండా, బీమా చేయ కుండా సముద్రంలోకి పంపించే బోట్ల యజమానులపై క్రిమినల్ కేసులు పెడితే ప్రమాదా లూ తగ్గుముఖం పడతాయి. ప్రాణనష్టం తగ్గుతుంది. బోటు ఖరీదు రూ. లక్ష అయినా రూ.1.2 లక్ష సాయం మత్స్యకా రులపట్ల కూటమి ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరి స్తోంది. లక్ష రూపాయల ఖరీదు చేసే బోటు అయినా సరే దేవల వేట నిషేధ సమయంలో బోటుకు ఆరుగురికి ఒక్కొ క్కరికి రూ.20 వేలు చొప్పున రూ.1.2లక్షల ఆర్థికసాయం చేస్తోంది. చేపల వేటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకో వాలి అధికారులు ప్రతి బోటును తనికీ చేయాలి. బోట్ డ్రైవర్స్ మద్యం సేవించి బోట్స్ నడపకుండా తగిన చర్యలు తీసుకోవాలి. కాలం చెల్లిన బోట్లను సముద్రం లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
-కామిడి సతీష్ రెడ్డి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

