Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాన్‌ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్‌పై FSSAI ఆంక్షలు

పాన్‌ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్‌పై FSSAI ఆంక్షలు

వార్త 1 week ago

FSSAI Rules: భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) పాన్ మసాలా ప్యాకేజింగ్ విధానంలో అత్యంత కీలకమైన మార్పులను ప్రకటించింది. పాన్ మసాలాను విక్రయించే ప్యాకెట్ల తయారీలో ప్లాస్టిక్‌తో పాటు ఎలాంటి సింథటిక్ మెటీరియళ్లను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఆహార ఉత్పత్తుల ప్యాకింగ్‌కు సంబంధించి ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్, మెటలైజ్డ్ లేయర్లను అనుమతించే జాబితా నుంచి పూర్తిగా తొలగించింది. కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో సోమవారం (ఆగస్టు 10) ప్రచురించిన ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్యాకేజింగ్) అమెండ్‌మెంట్ రెగ్యులేషన్స్, 2026’ ద్వారా ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వచ్చాయి.

Read Also : SIR : ఉమ్మడి ఖమ్మంలో దాదాపు 3 లక్షల ఓట్లు ఔట్

 FSSAI restrictions on plastic in pan masala packaging

FSSAI Rules: 2018 ప్యాకేజింగ్ నిబంధనలకు సవరణలు

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని FSSAI, 2018 నాటి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్యాకేజింగ్) నియమాల్లో మార్పులు చేసింది. ఇందులో భాగమైన షెడ్యూల్-4 కింద పాన్ మసాలా ప్యాకింగ్‌ను కొత్త ఎంట్రీగా చేర్చారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం పాన్ మసాలాను కేవలం పేపర్, పేపర్‌బోర్డ్, సెల్యులోజ్ లేదా ఇతర సహజసిద్ధమైన ప్లాస్టిక్ రహిత మెటీరియల్స్‌లో మాత్రమే ప్యాక్ చేయాల్సి ఉంటుంది.

నిషేధించిన మెటీరియల్స్, కొత్త ప్రత్యామ్నాయాలు

ఈ ప్యాకింగ్ మెటీరియల్‌లో పాలిథిలిన్, పాలిప్రొఫైలిన్, పాలిస్టర్, పీవీసీ (పాలీవినైల్ క్లోరైడ్) వంటి ఏ విధమైన సింథటిక్ పాలిమర్లు, కోపాలిమర్లు లేదా లామినేట్లు ఉండకూడదని నోటిఫికేషన్‌లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నొక్కి చెప్పింది. బయటకు కాగితంలా కనిపించి, లోపల ప్లాస్టిక్ లేదా మెటలైజ్డ్ కోటింగ్ ఉండే ప్యాకెట్లను కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. అయితే, తయారీదారులు విక్రయాల కోసం టిన్ లేదా గాజు (గ్లాస్) కంటైనర్లను ప్రత్యామ్నాయంగా వాడుకోవడానికి సమ్మతి తెలిపారు. ఈ నిబంధనల అమలు ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలు-2016 కూడా పాన్ మసాలా పరిశ్రమకు వర్తిస్తాయి.

జలమయమైన నోయిడా ఎయిర్పోర్టు !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha