ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మత్స్యకార సాయం రెండో యేడాది కూడా ఇచ్చాం : డి.సిఎం పవన్
pawan kalyan: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని డిప్యూటీ సిఎం చంద్రబాబు స్పష్టం చేసారు.
మత్సకారులకు వేట నిషేధ సమయంలో అండగా నిలుస్తామని వాగ్దానం చేసామన్నారు. ఆ మేరకు కూటమి ప్రభుత్వం వరుసగా రెండో యేడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని విడుదల చేసిందని తెలిపారు. బుధవారం ఉపముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మత్స్యకారుల సేవలో పథకం కింద అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నామన్నారు.
Read also: Deloitte Campus : ఏపీలో డెలాయిట్ క్యాంపస్?
AP fishermen financial aid scheme
గత ప్రభుత్వం రూ.10 వేలు మాత్రమే ఇవ్వగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి ఇస్తుంది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం మొత్తం రూ.262 కోట్లు వ్యయం చేస్తోంది. కాకినాడ జిల్లాలో 24,930 మంది లబ్దిదారులకు రూ.49.86 కోట్ల మేర, పిఠాపురం నియోజకవర్గంలో 6,897 మంది లబ్ధిదారులకు రూ.13.79 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందన్నారు. మత్స్యకారుల వలసలు తగ్గించే దిశగా అడుగులు.. కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల కోస్తా తీరం పరిధిలో ఉన్న 23 ల్యాండింగ్ సెంటర్లు, 51 మత్స్యకార గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో పథకాలు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి అన్నారు. 4,578 బోట్లకుగాను 91.48 లక్షల లీటర్ల డీజిల్పై ప్రభుత్వం రూ.8.23 కోట్ల రూపాయల సబ్సిడీని అందించింది.
pawan kalyan: ఆధునిక సౌకర్యాలతో భద్రత
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, డిఆర్డీఏ సహకారంతో ఇంజన్లు, వలలు, బోట్లు, ఆటోలు, ద్విచక్రవాహనాల కొనుగోలుకు రూ.1.13 కోట్ల రూపాయల సబ్సిడీ అందించింది. కోనపాప పేట గ్రామంలో మత్స్యకారుల కోసం రూ.2కోట్ల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నాం. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం ప్రభుత్వం ఉచితంగా 100శాతం సబ్సిడీపై ట్రాన్స్ పాండర్స్ ఇస్తోంది. ఇవి తుపానులు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడతాయి. సముద్రంలో జీవవైవిధ్యాన్ని, చేపల సంఖ్యను పెంచడానికి జిల్లాలో 20 స్థలాలను ఎంపిక చేశారు. ఒక్కో చోట రూ.20 లక్షల వ్యయంతో ఆర్టిఫిషియల్ రీప్స్ ఏర్పాటు చేస్తున్నాం. సముద్ర తాబేళ్లను రక్షించేందుకు వీలుగా అన్ని ట్రాలింగ్ బోట్లకు ఉచితంగా టెడ్ పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు.

