Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో డెలాయిట్ క్యాంపస్?

ఏపీలో డెలాయిట్ క్యాంపస్?

వార్త 3 months ago

Deloitte : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని, సాగర తీర నగరం విశాఖపట్నం ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. గ్లోబల్ ఐటీ మరియు కన్సల్టింగ్ దిగ్గజాలు వైజాగ్ వైపు అడుగులు వేస్తుండటంతో నగరంలో సాఫ్ట్‌వేర్ కళ సంతరించుకుంటోంది.

ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), కాగ్నిజెంట్ (Cognizant), ఇన్ఫోసిస్ (Infosys) వంటి అగ్రశ్రేణి కంపెనీలు విశాఖలో తమ కార్యకలాపాలను విజయవంతంగా ప్రారంభించగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ మల్టీనేషనల్ కన్సల్టింగ్ సంస్థ ‘డెలాయిట్’ (Deloitte) కూడా చేరబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖపట్నంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రుషికొండ ఐటీ హిల్స్ (Rushikonda IT Hills) వేదికగా డెలాయిట్ తన నూతన క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీ ప్రభుత్వ ఐటీ అనుకూల విధానాలు మరియు విశాఖలో ఉన్న అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.

Read Also : ఎరువులను పక్కదారి పట్టిస్తే లైసెన్స్ రద్దు.. గోడౌన్లపై తనిఖీలు చేపట్టండి

ఉద్యోగులకు డెలాయిట్ అంతర్గత ఈమెయిల్స్.. హోమ్ టౌన్ రీ-లొకేషన్‌కు గోల్డెన్ ఛాన్స్!

విశాఖపట్నంలో క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి డెలాయిట్ యాజమాన్యం ఇప్పటికే క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలు మరియు మెట్రో నగరాల్లోని డెలాయిట్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ఉద్యోగులకు కంపెనీ అంతర్గతంగా ఈమెయిల్స్ పంపినట్లు సమాచారం. కర్ణాటకలోని మంగళూరు, గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ (GIFT City) లతో పాటు విశాఖపట్నం క్యాంపస్‌కు రీ-లొకేషన్ (Relocation) అయ్యేందుకు ఆసక్తి ఉన్న ఉద్యోగులు తమ వివరాలను తెలియజేయాలని ఆ మెయిల్‌లో కోరినట్లు బోగట్టా. సొంత రాష్ట్రంలో, అదీ సాగరతీర నగరంలో పనిచేసే అవకాశం రానుండటంతో ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డెలాయిట్ లాంటి గ్లోబల్ బ్రాండ్ రాకతో విశాఖలో మరిన్ని వేల మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఉత్తరాంధ్ర ఐటీ ఎకోసిస్టమ్ సరికొత్త ఊపు అందుకోనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జాతీయ తైక్వాండో పోటీల్లో విజయనగరం క్రీడాకారుల ప్రభంజనం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha