Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మత్తులో ఏఎస్ఐ హల్‌చల్.. బిల్లు అడిగినందుకు హోటల్ ఓనర్‌పై దాడి

మత్తులో ఏఎస్ఐ హల్‌చల్.. బిల్లు అడిగినందుకు హోటల్ ఓనర్‌పై దాడి

వార్త 2 months ago

Tirupati Police: తిరుపతి నగరంలోని ప్రముఖ కూడలి అయిన పూర్వీక సెంటర్ (Poorvika Center) లో ఉన్న ఒక బిర్యానీ హోటల్‌కు గురువారం రాత్రి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ( SPF ) లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) గా పనిచేస్తున్న రాము అనే అధికారి వెళ్లాడు.

అప్పటికే పూర్తి మద్యం మత్తులో ఉన్న ఏఎస్ఐ రాము, హోటల్ యజమానిని ఉచితంగా బిర్యానీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు హోటల్ నిర్వాహకుడు నిరాకరించి, బిల్లు డబ్బులు అడిగాడు.

Read also:Rajasthan crime: భర్త తో సహా నలుగురిని నరికి చంపి.. కారులో కాల్చేసిన మహిళ!

Tirupati Police: నన్నే డబ్బులు అడుగుతావా అంటూ వీరంగం – ప్రతిదాడి

 Poorvika Center Hotel Fight Tirupati

ఒక పోలీస్ అధికారినైన నన్నే డబ్బులు అడుగుతావా అంటూ మద్యం మత్తులో ఉన్న ఏఎస్ఐ రాము హోటల్ యజమానిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. బూతులు తిడుతూ కౌంటర్ లోపలికి దూసుకెళ్లి హోటల్ యజమానిపై భౌతిక దాడికి దిగాడు. ఏఎస్ఐ రాము ప్రవర్తనతో విసిగిపోయిన హోటల్ యజమాని, సిబ్బంది కూడా వెనక్కి తగ్గకుండా తిరగబడ్డారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన అధికారి ఇలా రౌడీలా ప్రవర్తించడంతో, హోటల్ యజమాని కూడా తిరిగి ఏఎస్ఐపై ఎదురుదాడికి దిగాడు.

ఈ ఇరువర్గాల ఘర్షణతో పూర్వీక సెంటర్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. హోటల్ వద్ద జరుగుతున్న గొడవను చూసి స్థానికులు, ప్రయాణికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. సమాచారం అందుకున్న స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణను అదుపులోకి తెచ్చారు. మద్యం మత్తులో ఉన్న ఎస్పీఎఫ్ ఏఎస్ఐ రామును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విధి నిర్వహణ పక్కనబెట్టి పబ్లిక్‌లో న్యూసెన్స్ సృష్టించిన ఏఎస్ఐపై శాఖాపరమైన చర్యలకు (Departmental Action) ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ఇంట్లో ఏసీ పేలి సీసీఐ తొలి ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దుర్మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha