Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భర్త తో సహా నలుగురిని నరికి చంపి.. కారులో కాల్చేసిన మహిళ!

భర్త తో సహా నలుగురిని నరికి చంపి.. కారులో కాల్చేసిన మహిళ!

వార్త 2 months ago

Rajasthan crime: రాజస్థాన్‌లో సినిమా విలన్‌ను మించిన క్రూరత్వంతో ఒక మహిళ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల పగతో రగిలిపోయిన ఓ మాజీ సర్పంచ్ మొదటి భార్య, తన భర్త, అత్తతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని అత్యంత దారుణంగా నరికి చంపింది.

ఆపై ఆ హత్యలను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాలను స్కార్పియో కారులో వేసి సజీవ దహనం చేసింది.

 family members burns in car

Read also:Duronto Express Toilet Cleaning:ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్‌లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది!

హైవేపై తగలబడిన కారు.. బయటపడ్డ శవాలు!

మే 28న ఉదయం అజ్మీర్ నగరానికి సమీపంలోని శ్రీరాంపుర గ్రామ హైవేపై ఓ స్కార్పియో కారు మంటల్లో తగులబడటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారు లోపల పూర్తిగా కాలిపోయిన మూడు మృతదేహాలను, పక్కనే ఉన్న పొలంలో సగం కాలిన మరో శవాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మృతులను మాజీ సర్పంచ్ రామ్ సింగ్ చౌదరి, ఆయన వృద్ధురాలైన తల్లి పూసీ దేవి (79), ఆయన రెండో భార్య (మాజీ జిల్లా పరిషత్ సభ్యురాలు) సూర్యగ్యాన్ దేవి, బంధువు మహిమా చౌదరి (30)గా గుర్తించారు. తొలుత ఇదొక రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, వారి ఫామ్‌హౌస్‌ను పరిశీలించిన పోలీసులకు అక్కడ భారీగా రక్తపు మరకలు కనిపించడంతో ఇది పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యగా తేల్చారు.

Rajasthan crime: పదునైన ఆయుధాలతో గొంతులు కోసి..

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రామ్ సింగ్ మొదటి భార్య సునీత తన మైనర్ పిల్లల (కొడుకు, కూతురు) సహాయంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. చాలా కాలంగా ఉన్న కుటుంబ గొడవలు, వేధింపులే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిందితులు వ్యవసాయానికి వాడే పదునైన ఆయుధాలతో మొదట ఆ నలుగురి గొంతులు కోసి చంపేశారు. అనంతరం శవాలను కారులోకి ఎక్కించి, ఫామ్‌హౌస్ నుండి కొంత దూరానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు.

నటనతో నమ్మించాలని చూసిన ‘లేడీ కిల్లర్’

హత్యల అనంతరం నిందితురాలు సునీత ఏమీ తెలియనట్టు బంధువుల ముందు తీవ్రంగా విలపిస్తూ, గుండెలు బాదుకుంటూ స్పృహతప్పినట్లు నాటకమాడింది. అయితే, పోలీసులు విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడం, సాంకేతిక (Technical) ఆధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టుల సహాయంతో అజ్మీర్ ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాలా బృందం ఈ మిస్టరీని వేగంగా ఛేదించి సునీతను అరెస్ట్ చేశారు. ఒకప్పుడు గ్రామంలో పేరున్న కుటుంబంలో ఇలాంటి ఘోరం జరగడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఆస్తి తగాదాల కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

హమీర్‌పూర్ జిల్లాలో అర్ధరాత్రి మృత్యుఘోష..రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha