Kaloji University : తెలంగాణలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (KNRUHS) వైద్య విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుత విద్యాసంవత్సరం (2026-27) నుంచి వైద్య కళాశాలల్లో చేరే విద్యార్థులందరికీ ఈ పెంచిన రుసుములు వర్తిస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ బి-కేటగిరీ యూనివర్సిటీ ఫీజు రూ. 40 వేల నుంచి ఏకంగా రూ. 1 లక్షకు పెరిగింది. అలాగే ఎన్‌ఆర్‌ఐ (సి-కేటగిరీ) విద్యార్థుల ఫీజును రూ. 70 వేల నుంచి భారీగా రూ. 2 లక్షలకు పెంచుతూ వర్సిటీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
MBBS Admissionsడెంటల్ విద్యార్థులపైనా భారం: ఆందోళనలో తల్లిదండ్రులు
కేవలం ఎంబీబీఎస్ కోర్సులకే కాకుండా డెంటల్ (బీడీఎస్) అభ్యర్థులపై కూడా వర్సిటీ ఫీజుల భారాన్ని మోపింది. బీడీఎస్ బి-కేటగిరీ విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఫీజును రూ. 20 వేల నుంచి రూ. 40 వేలకు పెంచగా, సి-కేటగిరీ అభ్యర్థులకు రూ. 40 వేల నుంచి రూ. 80 వేలకు పెంచారు. ఈ నిర్ణయంతో ప్రైవేట్ మరియు మేనేజ్‌మెంట్ కోటాలో మెడికల్ సీట్లు పొందే విద్యార్థుల కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడనుంది. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకున్న ఈ సంస్కరణలు వైద్య విద్యను అభ్యసించాలనుకునే మధ్యతరగతి, ఉన్నత తరగతి కుటుంబాల నిధుల ప్రణాళికను తలకిందులు చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

