Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మే 10వ తేదీన హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ

మే 10వ తేదీన హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ

వార్త 1 month ago

మే 10వ తేదీన తెలంగాణ గడ్డపై ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టనున్నారు. మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి ఆయన వస్తుండటంతో అధికార యంత్రాంగం మరియు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.

హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సుమారు రూ. 8,000 కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మౌలిక సదుపాయాలు, రవాణా మరియు ఇంధన రంగాలకు చెందిన కీలక ప్రాజెక్టులను ఆయన దేశానికి అంకితం చేయనున్నారు. ఈ భారీ నిధుల కేటాయింపు తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం చూపిస్తున్న నిబద్ధతకు నిదర్శనమని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Read Also: Supreme Court: పవన్ ఖేరా ముందస్తు బెయిల్ తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

 Hyderabad

Hyderabad: సికింద్రాబాద్‌లో ‘జనగ్రహ సభ’

అభివృద్ధి కార్యక్రమాల అనంతరం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించ నున్నారు. ఈ సభకు “జనగ్రహ సభ” అని పేరు పెట్టారు. దీని ద్వారా రాబోయే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను ఉత్సాహపరచాలని బీజేపీ భావిస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు ఈ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పిలుపునిచ్చారు. ఈ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ మండిపడుతోంది. మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కాంగ్రెస్ తీరు వల్ల దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోందని రామచందర్ రావు ఆరోపించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: కూలీల ట్రక్కు బోల్తా, 16 మంది మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha