Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: కూలీల ట్రక్కు బోల్తా, 16 మంది మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: కూలీల ట్రక్కు బోల్తా, 16 మంది మృతి

వార్త 1 month ago

ధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన విషాదకర ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కూలీలతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ధార్ జిల్లాలోని బగ్గడ్ ప్రాంతం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 35 మంది కూలీలతో వెళ్తున్న పికప్ వ్యాన్, ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డుపై బోల్తా పడింది. మొత్తం 16 మంది చనిపోగా, వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. 20 మందికి పైగా కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం ఇందౌర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

Read Also: King Charles: స్టేట్ డిన్నర్‌లో చమత్కారం: ట్రంప్‌కు రాజు ఛార్లెస్ చారిత్రక కౌంటర్

 Accident in Madhya Pradesh

Accident in Madhya Pradesh: సహాయక చర్యలు దర్యాప్తు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. వాహనం అతివేగంగా ఉండటం లేదా సాంకేతిక లోపం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇస్తూ ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం. గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం. కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఆరేళ్ల బాలిక గుండెపోటుతో మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha