Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మే 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్!

మే 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్!

వార్త 3 months ago

Medical shops strike: ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 12.4 లక్షల మెడికల్ షాపులను మూసివేయాలని ఆలిండియా అర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపునిచ్చింది.

ఆన్‌లైన్‌ ద్వారా మందుల విక్రయాలను నిలిపివేయాలని, కార్పొరేట్‌ కంపెనీల భారీ డిస్కౌంట్లను ఆపాలని, కల్తీ ఔషధాలను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఓసీడీ 20న దేశవ్యాప్త సమ్మె చేపట్టనుంది.

ఈ బంద్ కారణంగా సాధారణ మందుల కొనుగోలుకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఐఓసీడీ సూచించింది. ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే ఎమర్జెన్సీ ఫార్మసీలు మాత్రం భక్తుల/రోగుల అవసరాల కోసం తెరిచి ఉండే అవకాశం ఉంది.

Read Also: Delhi: ఢిల్లీలో సీఎన్‌జీ ధరల పెంపు.. ఆటో, టాక్సీ ఛార్జీలపై ప్రభావం

 Nationwide medical shop closure on May 20th!

Medical shops strike: బంద్‌కు ప్రధాన కారణాలు

సాంప్రదాయ మెడికల్ షాపుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న పలు అంశాలపై కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్పొరేట్ కంపెనీల అండదండలతో నడుస్తున్న ఈ-ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ చిన్న ఫార్మసీలను దెబ్బతీస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్ విక్రయాల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ల దుర్వినియోగం జరుగుతోందని, ఇది ప్రజారోగ్యానికి ప్రమాదకరమని కెమిస్టులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు తగ్గిస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

'డెడికేటెడ్' నివేదికతో బిసిలకు న్యాయం జరిగేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha