BC Reservations: మన దేశంలో కుల వ్యవస్థ కేవలం ఒక సామాజిక విభజన కాదు, అది శతాబ్దాలుగా అధికారాన్ని, ఆస్తి ని, విద్యను, అవకాశాలను కొద్ది వర్గాల చేతుల్లో కేంద్రీక రించిన నిర్మాణం.
ఈనిర్మాణం వల్ల అనేక కులాలు సామా జికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురయ్యా యి. ముఖ్యంగా బీసీలు కేవలం పేదరికానికే కాదు, అధి కార నిర్మాణాల నుంచి వ్యవస్థీకృతంగా దూరం చేయబడ టానికి కూడా గురయ్యారు. కుల వ్యవస్థలో కొన్ని వర్గాలకు పాలించే హక్కు దక్కగా, మరికొన్ని వర్గాలకు సేవ చేసే బాధ్యత మాత్రమే మిగిలింది. గ్రామ పాలన నుంచి శాసన వ్యవస్థ వరకు, విద్యాసంస్థల నుంచి ఉద్యోగ రంగాలవరకు సమాన అవకాశాలు అందని పరిస్థితి ఏర్పడింది. ఈ వెనుక బాటుతనం వ్యక్తిగత వైఫల్యం వల్ల కాదు, కుల ఆధిపత్యం చరిత్రపరంగా నిర్మించిన అసమాన వ్యవస్థ వల్ల ఏర్పడింది. అందుకే బీసీ రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం, కులగణన వంటి అంశాలు కేవలం ఎన్నికల నినాదాలు కాదు, అధికారంలో భాగస్వామ్యం కోసం జరుగుతున్న సామాజికరాజ కీయ పోరాటాలుగా మారాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ‘డెడికేటెడ్ కమిషన్’ అనే అంశం ప్రాముఖ్యత పొందింది. సుప్రీంకోర్టు కూడా కేవలం జనాభా ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించకూడదని, రాజకీయంగా వెనుకబాటుతనంపై శాస్త్రీయ అధ్యయనం అవసర మని స్పష్టం చేసింది.
Read Also: Essential Goods Price: భారీగా పెరగనున్న కూరగాయలు, పప్పుల ధరలు
BC Reservations
BC Reservations: రాజ్యాంగబద్ధమా కాదా
2010లో కె. కృష్ణమూర్తి కేసు, తరు వాత వికాస్ కిషన్ రావ్ గవాలీ కేసుల్లో సుప్రీంకోర్టు స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల విషయంలో ‘త్రిపుల్ టెస్ట్’ విధా నాన్ని తప్పనిసరి చేసింది. రాజకీయ వెనుకబాటుతనంపై ప్రత్యేక డెడికేటెడ్కమిషన్ ద్వారా ఎంపిరికల్ డేటా సేకరిం చడం, ఆ డేటా ఆధారంగా మాత్రమే రిజర్వేషన్లు నిర్ణయిం చడం, మొత్తం రిజర్వేషన్ల సమతుల్యతను కా పాడడంవంటి నిబంధనలను కోర్టు స్పష్టం చేసింది. అంటే డెడికేటెడ్ కమిషన్ ఒకసాధారణ పరిపాలనా వ్యవస్థకాదు, అది రాజ్యాంగ పరంగా అవసరమైన ప్రక్రియగా మారింది. ఈ కమిషన్ పని కేవలం ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి?’ అని చెప్పడం కాదు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జెడ్పీలు, కార్పొరేషన్లలో బీసీల అసలు ప్రాతినిధ్యం ఎంత ఉంది? అన్ని ఉపకులాలకు సమాన అవకాశాలు దక్కుతున్నాయా? లేక కొద్దివర్గాలకే అధికార భాగస్వామ్యం పరిమితమవుతోందా? అనే అంశాలను పరిశీలించాలి. అలాగే డెడికేటెడ్ కమి షన్ నేరుగా రిజర్వేషన్ శాతాన్ని ప్రకటించే సంస్థ కాదు. కానీ ఎంత శాతం రిజర్వేషన్కు శాస్త్రీయ, న్యాయపరమైన ఆధారం ఉందో ప్రభుత్వానికి సూచించే కీలక వ్యవస్థ. కమిషన్ ఇచ్చే ఎంపిరికల్ డేటా, రాజకీయ వెనుకబాటు తనంపై అధ్యయనాల ఆధారంగానే ప్రభుత్వం రిజర్వేషన్ శాతాన్ని నిర్ణయిస్తుంది. తరువాత అది రాజ్యాంగబద్ధమా కాదా అనే అంశాన్ని న్యాయస్థానాలు పరిశీలిస్తాయి. అంటే ఈ కమిషన్ పని కేవలం సంఖ్యలు చెప్పడం కాదు, అధికార నిర్మాణంలో ఎవరు బయట ఉన్నారు? ఎందుకు బయట ఉన్నారు? అనే చారిత్రక ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం వెతకడం.
అంతర్గత అసమానతల
ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కులగణన, ఎంపిరికల్ డేటా రెండూ ఒకటి కావు. కులగణన జనాభా లెక్కలను తెలియ జేస్తే, డెడికేటెడ్ కమిషన్ పరిశీలించాల్సింది రాజకీయ వెను కబాటుతనం. అంటే జనాభాలో పెద్ద వాటా ఉన్న వర్గాలకు స్థానిక సంస్థల్లో, అధికార నిర్మాణాల్లో నిజంగా ఎంత ప్రాతి నిధ్యం దక్కుతోంది? ఎంతమంది ఎన్నికై వస్తున్నారు? ఏ వర్గా లు నిరంతరం బయటే మిగిలిపోతున్నాయి? అనే వ్యత్యా సాన్ని అధ్యయనం చేయడమే కమిషన్ అసలు బాధ్యత. ఎందుకంటే సంఖ్యల్లో ఎక్కువగా ఉండటం, అధికారంలో ఎక్కువగా ఉండటానికి సమానం కాదు. అనేక సందర్భాల్లో జనాభాలో పెద్ద వర్గాలే రాజకీయంగా అంచులకు నెట్టబడి ఉండవచ్చు. అలాగే బీసీ వర్గాల అంతర్గత అసమానతలను కూడా ఈ కమిషన్ లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. ఏబీసీడీ వర్గీకరణ ఉన్నప్పటికీ, రాజకీయ అధికారంలో మాత్రం కొన్ని నిర్దిష్టకులాలే ఆధిపత్యం కొనసాగిస్తున్నాయనే విమర్శ ఉంది. ఒకవైపు బీసీల పేరుతో రిజర్వేషన్లు కొనసా గుతున్నా, మరోవైపు కొన్ని ఉపకులాలు నిరంతరం రాజకీయ అవకాశా లకు దూరంగానే మిగిలిపోతున్నాయనే ప్రశ్నను డెడికేటెడ్ కమిషన్ నిజాయితీగా పరిశీలించాలి. కానీ వాస్తవ పరిస్థితిని చూస్తే అనేక రాష్ట్రాల్లో ఈ కమిషన్లు ప్రజాస్వా మ్య అధ్య యన వేదికల్లా కాకుండా, ప్రభుత్వ నిర్ణయాలకు న్యాయ బద్ధత కల్పించే పరిపాలనా యంత్రాంగాలుగా మారుతున్నా యనే విమర్శ ఉంది. పూర్తిస్థాయి కులగణన లేకుండా అంచ నాలతో నివేదికలు ఇవ్వడం, ప్రజలకుపూర్తి డేటా అందు బాటులో లేకపోవడం, ఉపకులాల మధ్య అసమానతలను లోతుగా పరిశీలింపోవడం వంటి సమ స్యలు కనిపిస్తున్నా యి.
రాజకీయ వెనుకబాటుతనం
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు దిశగా ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమి షన్ కూడా ఇదే చర్చకు కేంద్రంగా మారింది. ఈ నిర్ణయం బీసీ వర్గాల్లో ఆశలు పెంచినా, కమిషన్ ఉపయోగించిన గణాంకాలు ఎంత పారదర్శకంగా ఉన్నాయి? పూర్తి స్థాయి కులగణన లేకుండా రాజకీయ వెనుకబాటుతనాన్ని ఎలా అంచనా వేశారు? అన్ని బీసీ ఉపకులాల పరిస్థితిని సమా నంగా పరిశీలించారా? వంటి ప్రశ్నలు వచ్చాయి. తరువాత ఈ అంశం న్యాయపరమైన వివాదాలకు వెళ్లడం ద్వారా ఒక విషయం
స్పష్టమైంది అదేమంటే, సామాజికంగా వెనుక బడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం కేవలం ఎన్నికల హామీ కాదు, దానికి విశ్వసనీయ గణాంకాలు, పారదర్శక అధ్యయనం, ప్రజల విశ్వాసం అవసరం. తెలం గాణ అనుభవం మరో ప్రమాదకరమైన వాస్తవాన్ని కూడా చూపించింది. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిషన్లముందు అనేక బీసీసంఘాలు, కొంత మేధావివర్గం స్వతంత్ర సామా జిక దృక్పథంతో కాకుండా, పాలకులు కోరుకున్న పరిమితుల లోనే వ్యవహరించాయనే విమర్శలు వచ్చాయి. కొంత నాయ కత్వం సమాజం వాస్తవ సమస్యలను బలంగా ముందుకు తేవడం కన్నా, అధికారవ్యవస్థకు అనుకూలంగా వ్యవహరిం చిందనే అసంతృప్తి బీసీ వర్గాల్లో వ్యక్తమైంది. తెలంగాణ అనుభవం మరో రాజకీయ వాస్తవాన్ని కూడా గుర్తు చేస్తోం ది. పాలకవర్గాలు కేవలం కమిషన్ల ద్వారా మాత్రమే కాదు, ఉద్యమ భాష, చర్చల దిశ, మేధావుల పాత్ర, సంఘాల ప్రాధాన్యతలను కూడా ప్రభావితం చేసే ప్రయత్నంచేస్తాయి.
BC Reservations
గణాంకాలకే పరిమితమయ్యే ప్రమాదం
అనేక బీసీ సంఘాలు, మేధావులు, ఆలోచనాపరులు స్వతంత్ర సామాజిక ఒత్తిడిని నిర్మించేస్థానం నుంచి క్రమం గా ప్రభుత్వ అనుకూలచర్చల పరిధిలోకి వెళ్లిపోయారనే విమర్శలు కూడా వచ్చాయి. ఎక్కడ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి? ఎక్కడ ప్రశ్నలను నియంత్రించాలి? ఎక్కడ ప్రజలను రోడ్లపైకి తీసుకురావాలి? ఎక్కడ చర్చలను పరిమితం చేయాలి? అనే అంశాల్లో అధికార రాజకీయాలు ఎలా పని చేస్తాయో తెలంగాణ అనుభవం ఒక గుణపాఠంలా నిలుస్తోంది. ఇదేపరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పునరావృతం కాకుండా ఉండాలంటే బీసీ ఉద్యమాలు తమ స్వతంత్ర రాజకీయ దిశను కాపాడుకోవాలి. కమిషన్ పనితీరులో ప్రభుత్వ పార దర్శకత ఎంత ముఖ్యమో, బీసీసంఘాలు, మేధావులు నిబద్ధత కూడా అంతే ముఖ్యమైనది. డెడికేటెడ్క మిషన్ సేక రించే డేటా, నివేదికలు, సిఫార్సులపై ప్రజలకు సామాజిక పర్యవేక్షణ హక్కుఉండాలి. కమిషన్ ప్రక్రియనుప్రజాస్వామ్య సోషల్ ఆడిటింగ్కు తెరవకపోతే, అది మళ్లీ పరిపాలనా గణాంకాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. సమాజం నుంచి వచ్చే విమర్శలు, అభ్యంతరాలు, ప్రత్యామ్నాయ గణాంకాలు, ఉపకులాల అనుభవాలు, తదితరం, ఇవన్నీ. కమిషన్అధ్యయనంలో భాగంకావాలి. లేదంటే కమిషన్లు ప్రజల జీవితాలను అధ్యయనం చేసే వేదికలుగా కాకుండా, ప్రభుత్వాలకు అవసరమైన నివేదికలు తయారు చేసే కార్యాలయాలుగానే మిగిలిపోతాయి. డెడికేటెడ్ కమిషన్ నిజంగా తన బాధ్యతను నిర్వర్తిస్తే అది కేవలం ఒక నివేదిక కాదు, చరిత్రపరంగా బయటకు నెట్టబడిన వర్గాలకు రాజకీయ స్వరం ఇచ్చే ప్రక్రియ అవుతుంది. లేదంటే అది మరో పరిపాలనా ప్రక్రియగానే మిగిలిపోతుంది.
-పాపని నాగరాజు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

