Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మే 27న 'జన నాయకన్' విడుదల? సీఎం హోదాలో థియేటర్లకు రాబోతున్న విజయ్!

మే 27న 'జన నాయకన్' విడుదల? సీఎం హోదాలో థియేటర్లకు రాబోతున్న విజయ్!

వార్త 2 months ago

Jana Nayagan Movie Release: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే (TVK) పార్టీ సృష్టించిన ప్రభంజనం విజయ్ సినీ కెరీర్‌కు అదిరిపోయే ముగింపునిచ్చేలా కనిపిస్తోంది.

ఆయన నటించిన ఆఖరి చిత్రం 'జన నాయకన్' విడుదలకు సంబంధించి గతంలో ఉన్న సెన్సార్ సమస్యలు, బిజినెస్ ఇబ్బందులు విజయ్ గెలుపుతో ఒక్కసారిగా తొలిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమాపై కోలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణం ఏర్పడింది.

Read Also: Kajal Aggarwal: మదర్స్ డే స్పెషల్: ప్రెగ్నెన్సీ జ్ఞాపకాలను పంచుకున్న కాజల్ అగర్వాల్.. ఫోటో వైరల్

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని మే 27న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బక్రీద్ సెలవులు,లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకునేలా ఈ తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. విజయ్ రాజకీయంగా సాధించిన విజయం ఈ సినిమా బిజినెస్‌పై భారీ ప్రభావాన్ని చూపింది. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నారు.

Jana Nayagan Movie Release: సోషల్ మీడియాలో మేకర్స్ విషెస్

సినిమా దర్శక నిర్మాతలు విజయ్‌కు సోషల్ మీడియా వేదికగా ఘనంగా అభినందనలు తెలిపారు. “అన్ని అడ్డంకులు దాటుకుని చరిత్ర సృష్టించిన మా జననాయకుడికి అభినందనలు. ఇది ఒక కొత్త మార్పు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి” అంటూ పెట్టిన పోస్ట్‌లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 Jana Nayagan Movie

అభిమానుల క్రేజీ అభ్యర్థన: 'సీఎం దళపతి విజయ్'

ఈ సినిమా టైటిల్ కార్డు విషయంలో అభిమానులు ఒక సరికొత్త అభ్యర్థనను నిర్మాతల ముందు ఉంచారు. విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్న తరుణంలో, సినిమా ప్రారంభంలో 'దళపతి విజయ్' అని కాకుండా 'సీఎం దళపతి విజయ్' అని పేరు వేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. తన అభిమాన నటుడిని వెండితెరపై ముఖ్యమంత్రి హోదాలో చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నిర్మాత ఆర్‌బీ చౌదరి మృతి.. సంతాపం వ్యక్తం చేసిన నారా లోకేష్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha