Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెదక్ జిల్లాలో పాముకాటుతో యువకుడి మృతి

మెదక్ జిల్లాలో పాముకాటుతో యువకుడి మృతి

వార్త 3 weeks ago

Medak Snake bite death: పాముకాటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన పెద్దశంకరంపేట మండలo జమున నాయక్ తాండ పంచాయతీ పరిధిలోని ఇస్రానాయక్ తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

ఇంట్లో నిద్రిస్తున్న మూడావత్ నరేష్ (29)ను పాము కాటువేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే నరేష్ మృతి చెందాడు.

Read Also : Hyderabad: కేపీహెచ్‌బీలో విషాద ఘటన.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య

 Youth dies of snakebite in Medak district.

Medak Snake bite death: ఆసుపత్రికి తరలిస్తున్న మార్గమధ్యలోనే మృతి

నరేష్‌ను పాము కాటువేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు

మృతుడు నరేష్‌ ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న నరేష్‌ను కోల్పోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని మృతితో బంధువులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. నరేష్ కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

శ్రీశైలంలో తీవ్ర విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha