Srisailam Crime: కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు సత్రం గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Read Also :Snapchat scam: స్నాప్‌చాట్‌లో పరిచయం.. యువతి నుంచి రూ.1.50 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు

Srisailam Crime: ఘటన వివరాలు
శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఈ దారుణం జరిగింది. మృతులందరూ శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నెల 20న వడ్డెర సత్రంలో రూమ్ తీసుకున్న ఈ కుటుంబ సభ్యులు, దాదాపు మూడు రోజులుగా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా.. హాల్లో ఇద్దరు పురుషులు, బాత్రూంలో ముగ్గురు మహిళలు ఉరివేసుకుని మృతిచెంది కనిపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు వేగవంతం చేశారు.
కేపీహెచ్‌బీలో విషాద ఘటన.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య

