Medak Press Club: మెదక్ ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో 'గుండె జబ్బులు' మొదటి వరుసలో ఉన్నాయి అని యశోద హాస్పిటల్ సీనియర్ గుండే నిపుణుల శశి శ్రీవాత్సవా పేర్కొన్నారు.
ఒకప్పుడు కేవలం వృద్ధులలో మాత్రమే కనిపించే గుండెపోటు (హార్ట్ ఎటాక్), ఇతర గుండె సమస్యలు, ఇప్పుడు 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉన్న యువతలో కూడా ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.మారిన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, అధిక మానసిక ఒత్తిడి, వేళకు నిద్రపోకపోవడం, జంక్ ఫుడ్ సంస్కృతి ఈ మార్పుకు ప్రధాన కారణాలని ప్రముఖ కార్డియాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు.
Read Also: Hyderabad Bus Terminal: గ్రేటర్‌లో ఆర్టీసీ బస్ డిపోల పెంపు
Awareness seminar on heart health at the Medak Press Club building.
Medak Press Club: అప్రమత్తం చేసే సంకేతాలు
ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఛాతీ మధ్యలో భరించలేని నొప్పు లేదా ఒత్తిడి ఎడమ చెయ్యి, దవడ, లేదా వీపు భాగంలోకి వ్యాపించే నొప్పి కొద్దిపాటి నడకకే విపరీతమైన ఆయాసం, చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం లేదా గుండె వేగంగా కొట్టుకోవడం (ఆరిథ్మియా)

గుండెను పదిలంగా ఉంచుకునే మార్గాలు
- రోజూ వ్యాయామం: రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి.
- సమతుల ఆహారం: పండ్లు, ఆకుకూరలు మరియు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. నూనె, ఉప్పు, మరియు చక్కెర వినియోగాన్ని తగ్గించాలి.
- ఒత్తిడి నివారణ: యోగా, ధ్యానం ద్వారా రోజువారీ మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.
- క్రమబద్ధమైన పరీక్షలు: 30 ఏళ్లు దాటిన వారు ఏడాదికి ఒకసారైనా బిపి, షుగర్ మరియు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
ఆరోగ్యకరమైన జీవనశైలే శ్రీరామరక్ష నివారణ అనేది చికిత్స కంటే చాలా మేలైనది. సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలితో మన గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చని గుండెవైద్యులు శశి శ్రీవత్సవ సూచించారు. మరియు ఈ సదస్సులో ఇతర డాక్టర్ల పాల్గొన్నారు.
Epaper: epaper.vaartha.com

