Smart meters telangana:తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా త్వరలో రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు అమల్లోకి రానున్నాయి.
ఈ కొత్త విధానం ద్వారా వినియోగదారులకు కచ్చితమైన విద్యుత్ బిల్లులు అందనున్నాయి. అధికారులు ఈ మేరకు అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తున్నారు.
Read also: Telangana Cheyutha Scheme: కొత్త పింఛన్ల దరఖాస్తుకు ఆగస్టు 31 వరకే చాన్స్!
Smart meters to be installed in Telangana soon.
కొత్త కనెక్షన్ల నుంచి ప్రారంభం
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం మొదట కొత్తగా వచ్చే విద్యుత్ కనెక్షన్లకు మాత్రమే ఈ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత దశలవారీగా పాత కనెక్షన్లన్నింటికీ కూడా వీటిని మారుస్తారు. మామూలుగా నెల దాటిన తర్వాత రీడింగ్ తీసే పద్ధతి ఇకపై పూర్తిగా మారుతుంది. ప్రతి నెలాఖరు రోజున ఈ స్మార్ట్ మీటర్లు స్వయంగా రీడింగ్ తీసుకుని నేరుగా బిల్లును పంపిస్తాయి.
Smart meters telangana:ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లు
సాధారణ వినియోగదారులతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యేకంగా ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం వల్ల విద్యుత్ వినియోగంలో పారదర్శకత పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సరికొత్త చర్యలతో విద్యుత్ శాఖలో మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారులకు బిల్లుల టెన్షన్ పూర్తిగా తప్పుతుంది.
Epaper: epaper.vaartha.com

