Medak Collector Gift: మార్చి 2026 లో జరిగిన పదవ తరగతి ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెదక్ జిల్లా కలెక్టర్ సరికొత్త ప్రోత్సాహకాన్ని అందించారు.
పదో తరగతి పరీక్షల్లో 560, ఆపై మార్కులు సాధించి జిల్లాకు పేరు తెచ్చిన 70 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గౌరవిస్తూ, వారిని ఉచితంగా రామోజీ ఫిల్మ్ సిటీ విహారయాత్రకు పంపేందుకు కలెక్టర్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ విద్యా విషయక విహారయాత్ర మంగళవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది.
Read Also :Medak Vidya Varotsavalu: మెదక్‌లో విద్యా వారోత్సవాల సంబరం!

Medak Collector Gift: ప్రతిభావంతులైన విద్యార్థులందరూ ఉదయం ఏడు గంటలకు మెదక్ కలెక్టరేట్ కార్యాలయం నుండి ప్రత్యేక వాహనంలో రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శనకు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు. విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ కోసం విద్యాశాఖ సిబ్బంది ప్రత్యేక రక్షణగా వ్యవహరిస్తున్నారు. ఈ విహార యాత్ర కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి సాధు సుదర్శన్ మూర్తి, సహాయ ప్రాజెక్ట్ అధికారి రమేష్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ప్రత్యేక అధికారి బాలలక్ష్మి, శ్రీకాంత్ లు విద్యార్థుల వెంట ఉండి వారిని నడిపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపేలా, వారి ప్రతిభను గుర్తిస్తూ ఇటువంటి వినూత్న నిర్ణయం తీసుకున్నందుకు గాను జిల్లా కలెక్టర్ కు, జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైతం కలెక్టర్ చొరవను కొనియాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ పర్యటన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో మిగతా విద్యార్థులకు కూడా ఇది ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

