Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెదక్‌లో గోల్కొండ పాఠశాలలో ప్రీ ప్రైమరీ అడ్మిషన్లు ప్రారంభం

మెదక్‌లో గోల్కొండ పాఠశాలలో ప్రీ ప్రైమరీ అడ్మిషన్లు ప్రారంభం

వార్త 2 months ago

Medak News: బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ రాణి బాలరాజ్, ఉపాధ్యాయులు. మెదక్ పట్టణ పరిధిలోని గోల్కొండ ప్రాథమిక పాఠశాలలో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్చన తెలిపారు.

ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ రాణి బాలరాజ్, పాఠశాల ఉపాధ్యాయులు రాజగోపాల్, రజని కలిసి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ మూడు సంవత్సరాల పైబడిన చిన్నారులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నర్సరీ(Medak News) నుంచి 5వ తరగతి వరకు చేర్పించి నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించుకోవాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా సదుపాయాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి అవసరమైన అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మెదక్ కలెక్టరేట్‌లో మిన్నంటిన రాష్ట్ర అవతరణ సంబరాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha