Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ వేడుకలు మెదక్ జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అంతకుముందు ఆయన చిన్న శంకరంపేటతో పాటు మెదక్ కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్, ఎస్పీ డి.వి. శ్రీనివాస్‌లతో కలిసి పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. పతాకావిష్కరణ అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి సాయుధ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజలతో కలిసి ఆయన రాష్ట్ర గీతాన్ని సామూహికంగా ఆలపించారు.
Medak Telangana formation day 2026
Medak Telangana formation day 2026
Read also: Smart Meters Installation: స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వేగవంతం చేయాలి
Telangana Formation Day:ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు


అనంతరం జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం మనసా, వాచా, కర్మణా అంకితమై ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని మంత్రి ఈ సందర్భంగా చదివి వినిపించారు. వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంత్రి, కలెక్టర్, ఎస్పీ ఈ ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి విద్యార్థులను అభినందించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. చివరగా, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ (డిఆర్ డివో) ఆధ్వర్యంలో జిల్లా సమైక్య సభ్యులకు రూ.102 కోట్ల 35 లక్షల విలువైన భారీ జంబో చెక్కును మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

