Medico Priyanka Case: తెలంగాణకు చెందిన మెడికో ప్రియాంక మృతి కేసులో రాజమహేంద్రవరంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు కారణమైన నిందితులు సూరంపూడి దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్‌లను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ స్థానిక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Vijay Sai Reddy: కొత్త పార్టీపై కీలక ప్రకటన
Medico Priyanka case: Two-day police custody for the accused.
Medico Priyanka Case: సెంట్రల్ జైలు నుంచి కస్టడీకి
మద్యం మత్తులో కారు నడుపుతూ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టి ఆమె మరణానికి కారణమైన కేసులో నిందితులు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కోర్టు అనుమతితో పోలీసులు వీరిని రేపటి నుంచి కస్టడీకి తీసుకుని విచారించనున్నారు.
రెండు రోజుల కస్టడీ సమయంలో ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, సంఘటన స్థలంలో జరిగిన పరిణామాలు, నిందితుల నేపథ్యంపై పోలీసులు లోతుగా విచారించనున్నారు. ఈ విచారణ ద్వారా కేసుకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలను సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com
తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసు: గాలింపు వేగవంతం చేయాలని హైకోర్టు ఉత్తర్వులు

