Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెడికో ప్రియాంక మృతి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వం

మెడికో ప్రియాంక మృతి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వం

వార్త 2 weeks ago

Medico Priyanka Death: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న ఘోర ఘటనలో తీవ్రంగా గాయపడిన తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థిని (MD) కె.

ప్రియాంక (28) చికిత్స పొందుతూ మృతి చెందారు. జోగులాంబ గద్వాల జిల్లా ఏక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన ప్రియాంక, రాజమహేంద్రవరం GSL మెడికల్ కాలేజీలో ఎండీ చదువుతున్నారు. ఈ నెల 3న తన స్నేహితుడు ఉమేశ్‌తో కలిసి మాల్ నుంచి స్కూటీపై బయటకు వస్తుండగా, మద్యం మత్తులో ఉన్న సురవరపు దశవంత్, ఆండ్రూ ఎడ్వర్డ్స్ అనే వ్యక్తులు సిబ్బందితో గొడవపడి వేగంగా కారులో పారిపోయే క్రమంలో వీరి స్కూటీని వరుసగా మూడుసార్లు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, బ్రెయిన్ డెడ్ అయి ఆదివారం తుదిశ్వాస విడిచారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

Read Also : Telangana fertilizer booking app: ఎరువుల కొనుగోలుకు కొత్త యాప్ విడుదల

 Death of medico Priyanka.. Telangana government calls for strict action against the accused.

Medico Priyanka Death: కఠినంగా శిక్షిస్తాం.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల హామీ

ఈ దారుణ ఘటనపై రెండు రాష్ట్రాల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గాంధీ ఆసుపత్రిలో ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారని స్పష్టం చేశారు. బాధితురాలి తండ్రి వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై నమోదు చేసిన కేసును హత్యా నేరంగా (IPC Section 302 / BNS) మార్చనున్నారు. ఈ విషాదకర ఘటనపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూసి, ప్రియాంక కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.

సర్కార్ దవాఖానల్లో ఉచిత MRI సేవలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha