AP Mega DSC: ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది చేపట్టిన ప్రతిష్టాత్మక మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలపై పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది.
ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలతో అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ దుష్ప్రచారానికి ఒడిగట్టిన వారు తక్షణమే విద్యాశాఖకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పరువు నష్టం నోటీసులు జారీ చేస్తామని ఓ ప్రకటనలో గట్టిగా హెచ్చరించింది.
ap mega dsc 2025 education-department warns
Read also: Mahanadu 2026 : రేపటి మహానాడు లో 20 తీర్మానాలను ప్రవేశపెట్టనున్న అధిష్టానం !!
నిబంధనల ప్రకారమే 15,941 పోస్టుల భర్తీ!
మెగా డీఎస్సీ-2025 ఎంపికల ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ప్రభుత్వ నియామక నియమ నిబంధనలు, అధికారిక ఉత్తర్వులు మరియు రిజర్వేషన్ రోస్టర్‌కు అనుగుణంగానే పూర్తి చేశాం. ముఖ్యంగా హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుపై ఎలాంటి కనీస అవగాహన లేని కొందరు వ్యక్తులు సమాజంలో అశాంతి రేకెత్తించేలా మాట్లాడుతున్నారు. క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయని, మెరిట్ లిస్టులు పెట్టలేదని వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు అని విద్యాశాఖ తేల్చిచెప్పింది.
AP Mega DSC: పటిష్ఠమైన డిజిటల్ భద్రతతో ఎంపికలు
ఉపాధ్యాయుల నియామకాల్లో ప్రతి దశలోనూ పూర్తి స్థాయి డిజిటల్ భద్రతను, లోపాల్లేని అభ్యంతరాల పరిష్కార యంత్రాంగాన్ని ప్రభుత్వం అమలు చేసింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే మెరిట్, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్లో బహిరంగంగా ప్రచురించినట్లు విద్యాశాఖ వివరించింది. కేవలం ప్రతిభ (మెరిట్) మరియు లీగల్ రిజర్వేషన్ల ఆధారంగానే అత్యంత సురక్షితమైన కంప్యూటరైజ్డ్ విధానంలో ఈ ప్రక్రియ అంతా సాగిందని స్పష్టం చేసింది.
వదంతులను నమ్మవద్దు: అభ్యర్థులకు సూచన
ఈ విధమైన ఫేక్ న్యూస్ వల్ల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో అనవసర ఆందోళనలు రేకెత్తడమే కాకుండా, ప్రభుత్వ నియామక సంస్థల విశ్వసనీయతకు, విద్యాశాఖ ప్రతిష్టకు భంగం కలుగుతోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల ఉద్యోగాల భర్తీలోనూ ఇదే విధమైన పారదర్శకతను కొనసాగిస్తామని, కాబట్టి నిరుద్యోగులు, అభ్యర్థులు ఇలాంటి అసత్య వదంతులను నమ్మి మోసపోవద్దని పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

