Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP EAPCET ఫలితాలు ఎప్పుడంటే?

AP EAPCET ఫలితాలు ఎప్పుడంటే?

వార్త 3 months ago

AP EAPCET : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) పరీక్ష ఫలితాల విడుదలపై ఎట్టకేలకూ ఒక స్పష్టత వచ్చింది.

ఈ ఏడాది ఫలితాలను జూన్ 10వ తేదీ తర్వాతే విడుదల చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. సాధారణంగా పరీక్ష ముగిసిన కొద్ది రోజుల్లోనే ఫలితాలు ఇచ్చే సంప్రదాయం ఉన్నప్పటికీ, ఈసారి ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన ఒక ప్రత్యేక అవకాశం వల్ల ఈ ఆలస్యం తప్పడం లేదు. ఈ ఏడాది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంటర్ ద్వితీయ సంవత్సరం మార్కులను మెరుగుపరుచుకునేందుకు (Betterment) విద్యాశాఖ చాన్స్ ఇచ్చింది. ఈ బెటర్మెంట్ పరీక్షలు జూన్ 5వ తేదీతో ముగియనున్నాయి. ఈఏపీసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో, ఆ పరీక్షలు పూర్తయి, మార్కుల వివరాలు అందే వరకు ఈఏపీసెట్ ఫలితాల ప్రకటనను నిలిపివేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Read Also : ఆక్వా రైతులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

వెయిటేజీ తలపోటు – వచ్చే ఏడాది నుంచి కీలక మార్పులకు విద్యాశాఖ యోచన!

ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కుల వెయిటేజీ విధానం ప్రతి ఏటా సాంకేతిక ఇబ్బందులకు, ఫలితాల ఆలస్యానికి కారణమవుతుండటంతో ఉన్నత విద్యాశాఖ ఇప్పుడు ఒక కీలకమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే విద్యా సంవత్సరం (Next Academic Year) నుండి ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కుల 25 శాతం వెయిటేజీని పూర్తిగా తొలగించాలని విద్యాశాఖ తీవ్రంగా యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం ఈఏపీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మార్కుల ఆధారంగానే వంద శాతం ర్యాంకులను కేటాయించే పద్ధతిని తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల ఇంటర్ బోర్డు ఫలితాలతో సంబంధం లేకుండా ఎంట్రన్స్ ఫలితాలను వేగంగా విడుదల చేయడానికి, జాతీయ స్థాయి పరీక్షల (JEE, NEET) తరహాలో కౌన్సిలింగ్ ప్రక్రియను సకాలంలో ప్రారంభించడానికి వీలవుతుంది. ప్రస్తుతానికి ఈ ఏడాది విద్యార్థులు మాత్రం తమ ఫలితాల కోసం జూన్ రెండో వారం వరకు వేచి చూడాల్సిందే.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఫార్మ్ టు హోమ్.. రైతుల కోసం సీఎం చంద్రబాబు సరికొత్త విధానం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha