Mega158 Movie Updates: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త చిత్రం (#Mega158) గురించిన అప్‌డేట్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ చిత్రం ఈ నెల 21న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముందే చిత్రబృందం ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. ‘జైలర్’, ‘డాకు మహరాజ్’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలకు విజువల్స్ అందించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విజయ్ పుట్టినరోజున ఈ స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేయడం విశేషం.
Read Also : Ram Charan Peddi Trailer: పెద్ది' ట్రైలర్ వచ్చేసింది..ఊరమాస్ లుక్‌లో రామ్ చరణ్!
Mega158 Movie Updates
Mega158 కోసం జిమ్‌లో చేస్తున్న మెగాస్టార్
ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి సరికొత్త మేకోవర్‌తో తన పాత్రకు తగ్గట్టుగా కనిపించేందుకు ఆయన జిమ్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఆయన వర్కవుట్ చేస్తున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..
ప్రతిరోజూ పరిమితులను అధిగమించడానికి ఒక కొత్త అవకాశం. #Mega158 కోసం నా ప్రియమైన బాబీతో మరో గుర్తుండిపోయే ప్రయాణానికి ఉత్సాహంగా, సిద్ధంగా ఉన్నాను. మే 21న ప్రారంభోత్సవం అని చిరంజీవి పేర్కొన్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో #Mega158పై ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ హై-వోల్టేజ్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
నేషనల్ క్రష్ షాకింగ్ కామెంట్స్.. కృతి సనన్‌ను అలా అనేసిందేంటి?

