Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మేజర్ అభిలాషకు ఐరాస అవార్డు

మేజర్ అభిలాషకు ఐరాస అవార్డు

వార్త 1 day ago

Major Abhilasha Barak UN Award: లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్ (UNIFIL) లో భారత దేశం తరఫున సేవలు అందిస్తున్న భారత సైన్యానికి చెందిన మహిళా అధికారి మేజర్ అభిలాష బారక్ సరికొత్త చరిత్ర సృష్టించారు.

అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్టను పెంచుతూ, ఐరాస అందించే ప్రతిష్టాత్మకమైన ‘యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ (2025)’ పురస్కారానికి ఆమె ఎంపికయ్యారు. విధుల్లో భాగంగా ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాల్లోని మహిళలు, బాలికలకు రక్షణ కల్పిస్తూ.. వారికి చేరువయ్యేందుకు ఆమె చేసిన విశేష ప్రయత్నాలకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి ఈ అవార్డును ప్రకటించింది.

Read Also :Hawaii Earthquake: అమెరికాలో భారీ భూకంపం

భారత ఆర్మీ మహిళా ఆఫీసర్‌కు అరుదైన గౌరవం

 First Woman Combat Helicopter Pilot India

మేజర్ అభిలాష బారక్ ప్రస్తుతం లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి తాత్కాలిక బలగాల ఇండియన్ బెటాలియన్‌లో ‘ఫిమేల్ ఎంగేజ్‌మెంట్ టీమ్’ (FET) కమాండర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యుద్ధ వాతావరణం నెలకొన్న స్థానిక సమాజంలోని మహిళలు, బాలికలతో నిరంతరం మమేకమవుతూ.. వారి భద్రత మరియు ఆరోగ్య సమస్యలపై ఆమె ప్రత్యేక కమ్యూనిటీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ అవార్డుకు ఎంపికవడానికి ముందే ఆమె భారత సైన్యంలో మొట్టమొదటి మహిళా కాంబాట్ హెలికాప్టర్ పైలట్‌గా చేరి దేశ రక్షణ రంగంలో సరికొత్త రికార్డు సృష్టించడం విశేషం.

Major Abhilasha Barak UN Award: భారత్ నుంచి మూడో మహిళా ఆఫీసర్

ఐక్యరాజ్యసమితి అందించే ఈ అరుదైన పురస్కారాన్ని అందుకుంటున్న మూడో భారతీయ మహిళా ఆర్మీ ఆఫీసర్‌గా మేజర్ అభిలాష నిలిచారు. గతంలో మేజర్ సుమన్ గవానీ (2019), మేజర్ రాధికా సేన్ (2023) ఈ గౌరవాన్ని దక్కించుకోగా.. ఇప్పుడు అభిలాష ఆ జాబితాలో చేరారు. మే 29న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరగబోయే ‘అంతర్జాతీయ ఐరాస శాంతి పరిరక్షకుల దినోత్సవం’ సందర్భంగా ఆమెకు ఈ అవార్డును అధికారికంగా ప్రదానం చేయనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha