Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మేకెదాటు డ్యామ్‌కు తమిళనాడు అసెంబ్లీ నో!

మేకెదాటు డ్యామ్‌కు తమిళనాడు అసెంబ్లీ నో!

వార్త 2 weeks ago

Mekedatu Dam Project : కావేరీ నది జలాలపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకెదాటు డ్యామ్ ప్రాజెక్ట్కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది.

ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సభలో ప్రవేశపెట్టగా, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.

ఈ సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ, కావేరీ జలాల పంపిణీపై ఇప్పటికే న్యాయపరమైన నిర్ణయాలు ఉన్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న మేకెదాటు ప్రాజెక్ట్ ఏకపక్ష చర్యగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని, తమిళనాడు రైతుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు.

Read Also: UN High Commissioner : 'ఫ్రాంకెన్‌స్టైన్ దేశం' పాకిస్థాన్‌పై ఐక్యరాజ్యసమితిలో భారత్ నిప్పులు

సుమారు రూ.9,000 కోట్ల వ్యయంతో నిర్మించాలనుకుంటున్న ఈ ప్రాజెక్ట్, కావేరీ జల వివాద ట్రైబ్యునల్ మరియు సుప్రీంకోర్టు తీర్పుల స్ఫూర్తికి విరుద్ధమని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న కావేరీ జలాలను సంబంధిత రాష్ట్రాల మధ్య పంచినందున కొత్త నీటి నిల్వ ప్రాజెక్టులకు అవకాశం లేదని స్పష్టం చేసింది.

 Mekedatu Dam Project news

మేకెదాటు డ్యామ్ నిర్మాణం వల్ల దిగువ ప్రాంతాల్లోని రైతులకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హక్కులను పరిరక్షించేందుకు అన్ని స్థాయిల్లో పోరాటం కొనసాగిస్తామని పేర్కొంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

అప్రమత్తతే అసలైన మందు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha