FIFA World Cup 2026:ఫీఫా ప్రపంచ కప్ 2026 వార్మప్ మ్యాచ్‌లు టోర్నమెంట్‌కు ముందు ఆసక్తిని పెంచుతున్నాయి. మెక్సికో సొంత మైదానంలో సెర్బియా జట్టుతో తలపడింది.
ఆట ప్రారంభంలోనే సెర్బియా ఆటగాడు పెటార్ స్టానిక్ 19వ నిమిషంలో గోల్ కొట్టి మెక్సికోను ఒత్తిడిలో పడేశాడు. అయితే ఆతిథ్య జట్టు ఏమాత్రం కుంగిపోకుండా వ్యూహాత్మకంగా ఆడింది. 34వ నిమిషంలో జోహాన్ వాస్క్వెజ్ హెడర్ ద్వారా గోల్ చేసి స్కోరును 1-1 తో సమం చేశాడు. ఆ తర్వాత సెర్బియా చేసిన పొరపాటు మెక్సికోకు కలిసి వచ్చింది. మొదటి హాఫ్ ముగిసే సమయానికి సెర్బియా సెల్ఫ్ గోల్ చేయడంతో మెక్సికో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ కీలక మలుపు మెక్సికో ఆటగాళ్లలో మరింత ఉత్సాహాన్ని నింపింది. సొంత గడ్డపై తమ అభిమానుల మధ్య మెక్సికో జట్టు అద్భుతమైన సమన్వయంతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది.
Mexico vs Serbia FIFA World Cup 2026 warmup match
రెండో అర్ధభాగంలో గోల్స్ వర్షం
విరామం తర్వాత మెక్సికో తన పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించింది. 57వ నిమిషంలో రౌల్ జిమెనెజ్ మెరుపు వేగంతో గోల్ చేసి ఆధిక్యాన్ని 3-1 కి పెంచాడు. ఈ దశలో సెర్బియా డిఫెన్స్ విఫలమవడంతో మెక్సికో సునాయాసంగా బంతిని పాస్ చేస్తూ ముందుకు సాగింది. 72వ నిమిషంలో సెర్బియా మరో సెల్ఫ్ గోల్ చేయడం మెక్సికోకు కలిసొచ్చింది. దీంతో ఆతిథ్య జట్టు 4-1 తో విజయాన్ని ఖరారు చేసుకున్నంత పని చేసింది. మ్యాచ్ ముగింపు దశలో లూయిస్ చావెజ్ చేసిన లాంగ్ రేంజ్ గోల్ స్టేడియాన్ని హోరెత్తించింది. మెక్సికో జట్టు క్రీడాకారులు వేగంగా కదులుతూ సెర్బియాకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ గెలుపు మెక్సికో జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. జేవియర్ అగ్యిరే శిక్షణలో మెక్సికో జట్టు ప్రపంచ కప్ కోసం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
FIFA World Cup 2026:క్రీడాకారుల ప్రదర్శన విశ్లేషణ
మ్యాచ్ ఫలితం మెక్సికో జట్టులోని ఆటగాళ్ల కఠిన శ్రమకు నిదర్శనం. రౌల్ జిమెనెజ్ (8.4/10), జోహాన్ వాస్క్వెజ్ (8.2/10) అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు వెన్నుముకగా నిలిచారు. సబ్స్టిట్యూట్ ఆటగాడు లూయిస్ చావెజ్ (8.5/10) తనదైన శైలిలో గోల్ చేసి ఆకట్టుకున్నాడు. సెర్బియా జట్టులో పెటార్ స్టానిక్ మినహా మిగిలిన వారు పెద్దగా రాణించలేకపోయారు. మెక్సికో డిఫెన్స్, ఫార్వర్డ్ లైన్ మధ్య సమన్వయం మెరుగ్గా ఉండటం ఈ గెలుపులో కీలకం. టోర్నమెంట్ ఆరంభానికి వారం ముందు ఇలాంటి భారీ విజయం సాధించడం ఆతిథ్య జట్టుకు మంచి శుభసూచకం. నెమెసియో డీజ్ స్టేడియంలో బాణసంచా వెలుగులతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న మెక్సికోకు ఈ గెలుపు పెద్ద ఊరట.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

