Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెటాలో భారీగా లేఆఫ్‌లు..ఏఐ కారణమేనా?

మెటాలో భారీగా లేఆఫ్‌లు..ఏఐ కారణమేనా?

వార్త 3 months ago

ప్రస్తుతం కృత్రిమ మేధ వల్ల అన్ని రంగాల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే ప్రముఖ టెక్ దిగ్గజం, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించింది.

సంస్థలోని వివిధ విభాగాల నుంచి సుమారుగా 700 మంది ఉద్యోగులపై వేటు విధించింది. ముఖ్యంగా రియాలిటీ ల్యాబ్స్, సేల్స్, రిక్రూటింగ్, ఫేస్‌బుక్ విభాగాల్లో లేఆఫ్‌లు జరిగాయి. రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో రెండోసారి ఈ ఏడాదిలో తొలగించడం జరిగింది. అంతకు ముందు వెయ్యి మంది ఉద్యోగులను ఈ విభాగం నుంచి తొలగించింది. అయితే అన్ని విభాగాలను కలిపి మొత్తం 16 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లుతెలుస్తోంది. మెటా ఏఐ రంగంలో తమ పెట్టుబడులను భారీగా పెంచుతోంది. ఈ క్రమంలోనే ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగస్తులను తొలగించినట్లు సమాచారం.

Read Also: The threat of hookah : యువత భవిష్యతుకు హుక్కా పొగల ముప్పు

 Meta Layoffs

Meta Layoffs: ఉద్యోగులను తొలగిస్తూనే.. భారీ బహుమతులు..

మెటా సంస్థ ఒకవైపు నుంచి ఉద్యోగులను తొలగిస్తూనే.. మరోవైపు సంస్థలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు మెటా భారీ బహుమతులు ప్రకటించింది. లేఆఫ్స్ ప్రకటించడానికి కేవలం కొన్ని గంటల ముందే కీలక అధికారుల కోసం కొత్త స్టాక్ ఆప్షన్లను కంపెనీ ప్రకటించింది. ఈ పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో సీనియర్ అధికారుల వేతన ప్యాకేజీలు భారీగా పెరగనున్నాయి. దీని విలువ సుమారు 921 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 8,600 కోట్లు అన్నమాట. ఏఐ రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో నైపుణ్యం కలిగిన ఉన్నతాధికారులు వేరే సంస్థలకు వెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికే ఈ భారీ ప్రోత్సాహకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఇండియాలో ఐఫోన్ 18 ప్రో ధర ఎంతంటే.?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha