Jagtial News: తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు నిదర్శనమైన బతుకమ్మ పండుగ వేళ జగిత్యాల జిల్లాలో ఒక అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. పెళ్లయ్యాక వచ్చే మొదటి బతుకమ్మ పండుగకు కొత్త కోడలికి అత్తింటి వారు వాయినం ఇవ్వడం ఆనవాయితీ.
అయితే, జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఓ అత్తింటి వారు తమ కొత్త కోడలికి ఏకంగా 25 రకాల వినూత్న బతుకమ్మలను వాయినంగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Read Also : Bathukamma festival: బతుకమ్మ సంబరాల్లో పెరిగిన పూల భారం!
New daughter-in-law in Metpally receives ‘Vayinam’ featuring 25 varieties of Bathukammas.
Jagtial News: 25 రకాల ప్రత్యేకాలతో ‘బతుకమ్మ’ వాయినం!
మెట్‌పల్లి చైతన్యనగర్‌కు చెందిన వెలగందుల జలేందర్ దంపతుల కూతురు పల్లవికి, ఐదు నెలల క్రితం గొల్లపల్లి మండలం అగ్గిమల్లకు చెందిన చిట్టిమల్లే అరవింద్‌తో వివాహమైంది. తొలి బతుకమ్మ పండుగను ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవాలని భావించిన పల్లవి అత్తింటి వారు, ఆమె కోసం గాజులు, బిస్కెట్లు, చాక్లెట్లు, వెండి నాణేలు, మెహందీ, ముత్యాలు, కాగితం, బత్తాయిలు మొదలైన 25 రకాల విభిన్న వస్తువులతో ఎంతో నైపుణ్యంగా బతుకమ్మలను తయారు చేయించారు.
వైభవంగా జరిగిన వేడుక
సోమవారం రాత్రి ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మెట్‌పల్లిలో ప్రత్యేకంగా వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో అత్తింటి వారు ఆ ప్రేమానురాగాల 25 రకాల బతుకమ్మలను కోడలు పల్లవికి వాయినంగా అందించారు. ఈ వినూత్న కార్యక్రమం స్థానికంగా విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలోనూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

