Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బతుకమ్మ సంబరాల్లో పెరిగిన పూల భారం!

బతుకమ్మ సంబరాల్లో పెరిగిన పూల భారం!

వార్త 1 week ago

Bathukamma festival:తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగపై ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా పడింది. వర్షపాతం తగ్గడం వల్ల ప్రకృతి సిద్ధంగా లభించే తంగేడు పూలు ఈసారి ఎక్కడా సరిగ్గా కనిపించడం లేదు.

గ్రామాలు, పొలాల గట్ల వెంట గతంలో విరివిగా దొరికే పూల కోసం ప్రజలు తీవ్రంగా వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణీకరణ, రియల్ ఎస్టేట్ విస్తరణ కారణంగా ఖాళీ ప్రదేశాలు పూర్తిగా కనుమరుగైపోవడం కూడా ఈ సహజ పూల లభ్యత పడిపోవడానికి మరో ప్రధాన కారణమైంది. దీనివల్ల పండుగలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పూలను సేకరించడం సామాన్య కుటుంబాలకు కష్టతరంగా మారింది. స్థానికంగా పూలు దొరకకపోవడంతో ప్రతి ఒక్కరూ మార్కెట్లపైనే పూర్తిగా ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

Singareni 3189 Jobs: సింగరేణి నియామకాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు

 The rising cost of flowers for Bathukamma celebrations!

కిలో రూ.300 దాటిన బంతి పూలు.. సామాన్యులకిది సాధ్యమేనా?

సహజ పూలు దొరకని కారణంగా మార్కెట్లలో బంతి పూలకు డిమాండ్ పెరిగింది. గతంలో కిలో రూ.60 ఉన్న బంతి పూల ధరలు హైదరాబాద్ వంటి కొన్ని చోట్ల రూ.300 వరకు చేరుకోవడంతో సామాన్యుల బడ్జెట్ తలకిందులైంది. హనుమకొండ మార్కెట్లో తొలి రోజు తంగేడు పూల కట్ట సుమారు రూ.100 కు విక్రయించారు. అలాగే గునుగు పూలు 3 నుంచి 4 కట్టలు రూ.100 నుంచి రూ.120 వరకు పలికాయి. స్థానిక మార్కెట్లలో బంతి పూల ధర కిలో రూ.150 ఉండగా, హైదరాబాద్ లో మాత్రం రేటు డబుల్ అయి రూ.300 కి చేరింది. నిత్యవసర వస్తువులు, కూరగాయల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలకు ఈ పూల ధరలు మరింత భారంగా మారాయి.

Bathukamma festival:ఉచితంగా దొరికే పూలకు వేలల్లో ఖర్చా?

సహజ వాతావరణంలో మార్పులు రావడం, వర్షాలు సరిగ్గా కురవకపోవడం వల్ల మొక్కల ఎదుగుదల దెబ్బతిన్నది. గతంలో ఉచితంగా లభించిన పూలను ఇప్పుడు మార్కెట్లలో అధిక ధరలు చెల్లించి కొనాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ సంప్రదాయాన్ని తగ్గకుండా కొనసాగించాలనే తపనతో ప్రజలు ఎక్కువ డబ్బులు వెచ్చించి పూలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ ఖర్చులు పెరిగిన వేళ ఈ పండుగ కొనుగోళ్లు అదనపు భారాన్ని మోపుతున్నాయని అంటున్నారు. పర్యావరణ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో మన సాంప్రదాయ పూల సంపదను కాపాడుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

Epaper: epaper.vaartha.com

మున్సిపాలిటీల ఖాతాల్లోకి రూ.296 కోట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha