Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీ ప్రొఫైల్ సేఫ్‌గా ఉండాలంటే ఈ 4 సెట్టింగ్స్ వెంటనే మార్చుకోండి!

మీ ప్రొఫైల్ సేఫ్‌గా ఉండాలంటే ఈ 4 సెట్టింగ్స్ వెంటనే మార్చుకోండి!

వార్త 2 weeks ago

WhatsApp Hacking: ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా ప్రజలు వాడుతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఇప్పుడు సైబర్ నేరగాళ్ల ప్రధాన లక్ష్యంగా మారింది.

ఇటీవల శివసేన నాయకురాలు షైనా ఎన్‌సి, బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర లాంటి ప్రముఖుల వాట్సాప్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురికావడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. హ్యాకర్లు వీరి అకౌంట్లను ఆధీనంలోకి తీసుకుని, వారి కాంటాక్ట్స్‌లో ఉన్నవారికి మెసేజ్‌లు పంపి రూ. 49,000 నుండి రూ. 55,000 వరకు డబ్బులు డిమాండ్ చేశారు.

Read Also :World Emoji Day 2026: ఈ బుజ్జి బొమ్మల వెనుక ఉన్న ఆసక్తికర చరిత్ర మీకు తెలుసా?

సైబర్ సెక్యూరిటీ నిపుణుల ప్రకారం.. హ్యాకర్లు వాట్సాప్ ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్ చేయడం లేదు. కేవలం యూజర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఫిషింగ్ లింకులు, నకిలీ కస్టమర్ కేర్ కాల్స్, సిమ్ స్వాప్ (SIM Swap) లేదా వెరిఫికేషన్ కోడ్‌లను దొంగిలించడం ద్వారానే ఈ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా వాట్సాప్ ప్రవేశపెట్టిన 'యూజర్‌నేమ్స్' (Usernames) ఫీచర్‌ను కూడా హ్యాకర్లు తప్పుడు అకౌంట్లు క్రియేట్ చేయడానికి వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే తక్షణమే ఎనేబుల్ చేసుకోవాల్సిన 4 కీలక భద్రతా ఫీచర్లు ఇవే.

1. పాస్‌కీస్ ఎనేబుల్ చేసుకోండి (Enable Passkeys)

వాట్సాప్ అకౌంట్‌ను భద్రపరచడానికి 'పాస్‌కీస్' అత్యంత సురక్షితమైన మార్గం.

  • ఇది ఎనేబుల్ చేయడం వల్ల ఎస్‌ఎమ్ఎస్ (SMS) వెరిఫికేషన్ కోడ్‌లతో పనిలేకుండా మీ ఫోన్ బయోమెట్రిక్ (Face ID, Touch ID లేదా Fingerprint) ద్వారానే లాగిన్ అవ్వచ్చు.
  • ఈ పాస్‌కీస్ మీ డివైజ్‌తో లింక్ అయి ఉంటాయి కాబట్టి, హ్యాకర్లు మిమ్మల్ని మోసం చేసి కోడ్ అడిగినా మీ ఫోన్ లేకుండా వారు అకౌంట్ ఓపెన్ చేయలేరు.

2. రికవరీ ఈమెయిల్ ఐడీని యాడ్ చేయండి (Add & Verify Email)

వాట్సాప్ ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్‌ను వెరిఫై చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.

  • ఒకవేళ మీరు సిమ్ కార్డ్ పోగొట్టుకున్నా, విదేశీ ప్రయాణాల్లో ఎస్‌ఎమ్ఎస్ కోడ్ రాకపోయినా, ఈ వెరిఫైడ్ ఈమెయిల్ ద్వారా మీ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు.
  • మీ రికవరీ ఈమెయిల్ అకౌంట్‌కు కూడా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్‌లో ఉంచుకోవడం ముఖ్యం.

3. టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయండి (Turn On Two-Step Verification)

ఇది మీ అకౌంట్‌కు డబుల్ లేయర్ ప్రొటెక్షన్‌ను ఇస్తుంది. దీనిని ఆన్ చేస్తే ఒక 6 అంకెల పిన్ (PIN) సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.

  • హ్యాకర్ ఒకవేళ మీ ఎస్‌ఎమ్ఎస్ ఓటీపీని దొంగిలించినా, ఈ 6 అంకెల పిన్ తెలియకపోతే మీ వాట్సాప్‌ను లాగిన్ చేయలేడు.
  • ఈ పిన్ సెట్ చేసుకునేటప్పుడు మీ పుట్టినరోజు లేదా 123456, 000000 లాంటి సులభమైన నంబర్లను పెట్టకండి.

4. బయోమెట్రిక్ లాక్ సెట్ చేయండి (Lock WhatsApp)

కేవలం లాగిన్ సెక్యూరిటీ మాత్రమే కాదు, మీ ఫోన్ ఇతరుల చేతికి వెళ్లినప్పుడు కూడా వాట్సాప్ సురక్షితంగా ఉండాలి.

  • ఐఫోన్ యూజర్లు ఫేస్ ఐడీ (Face ID), ఆండ్రాయిడ్ యూజర్లు ఫింగర్‌ప్రింట్ (Fingerprint) లాక్‌ను వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఆన్ చేసుకోవాలి.
  • దీనివల్ల మీ ఫోన్ అన్‌లాక్ చేసి ఉన్నా, మీ బయోమెట్రిక్ పర్మిషన్ లేనిదే ఎవరూ మీ వ్యక్తిగత చాట్స్, డాక్యుమెంట్లను చూడలేరు.

చివరి నిమిషంలో నిలిచిన 'విక్రమ్-1' చారిత్రాత్మక ప్రయోగం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha