Dailyhunt
మీ సేవ కేంద్రంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు!

మీ సేవ కేంద్రంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు!

వార్త 1 week ago

ACB Raids Sangareddy Mee Seva: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి జిల్లా పరిషత్ సమీపంలో ని కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్న శ్రీ కేతకి సంగమేశ్వర కమ్యూనికేషన్ మీ సేవలో బుధవారం సాయంత్రం ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు మీసేవలోని రికార్డులను కంప్యూటర్లో జరిగిన లావాదేవీలను పరిశీలిస్తున్న అధికారులు తనిఖీల అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్న ఏసీబీ అధికారులు.

Read Also: Mission Bhagiratha: ఇశ్రీతాబాద్‌లో ఘనంగా 'జల మహోత్సవం'

 Ketaki Sangameshwara Communication Mee Seva

ACB Raids Sangareddy Mee Seva: దళారుల రాజ్యం.. సామాన్యులకు తప్పని ఇబ్బందులు

ఏసీబీ ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మీ సేవ నిర్వాహకులు, సిబ్బంది దళారులతో చేతులు కలిపి చక్రం తిప్పుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలు నేరుగా దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి పెండింగ్‌లో పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న సిబ్బంది, దళారుల ద్వారా అధిక ధరలు చెల్లించి వచ్చే దరఖాస్తులను మాత్రం గంటల వ్యవధిలో పరిష్కరిస్తున్నట్లు తేలింది. ప్రభుత్వ నిర్ణీత ఫీజు కంటే రెండు మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తూ సామాన్యులను పీడిస్తున్న తీరుపై బాధితులు ఏసీబీ అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఇశ్రీతాబాద్‌లో ఘనంగా 'జల మహోత్సవం'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha