Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మిచెల్ మార్ష్ విధ్వంసం: బెంగళూరు ముందు భారీ లక్ష్యం

మిచెల్ మార్ష్ విధ్వంసం: బెంగళూరు ముందు భారీ లక్ష్యం

వార్త 2 weeks ago

LSG vs RCB Live Score: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది.

వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో లక్నో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

Read Also:David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు: తప్పు ఒప్పుకున్న స్టార్ క్రికెటర్

 Mitchell Marsh Century

మార్ష్ వీరోచిత సెంచరీ

లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ ఆరంభం నుంచే బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 56 బంతుల్లోనే 9 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు.మార్ష్ ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (17) తో కలిసి 56 బంతుల్లో 95 పరుగులు, నికోలస్ పూరన్ (38) తో కలిసి 41 బంతుల్లో 70 పరుగులు జోడించాడు.చివర్లో కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం 10 బంతుల్లోనే 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

వర్షం అంతరాయం – కుదించిన ఓవర్లు

ఈ మ్యాచ్‌కు వర్షం మూడుసార్లు అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను ఇరు జట్లకు 19 ఓవర్లకు కుదించారు. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం, బెంగళూరు విజయం సాధించాలంటే 19 ఓవర్లలో 213 పరుగులు చేయాల్సి ఉంది.

లక్నో బ్యాటర్ల ధాటికి బెంగళూరు బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.కృనాల్ పాండ్యా (1/31), జోష్ హేజిల్‌వుడ్ (1/49) చెరో వికెట్ పడగొట్టారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మిచెల్ మార్ష్ మెరుపు సెంచరీ.. వర్షంతో ఆగిన ఆట!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha