Vijay Sai Reddy: వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి, తన రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలికి సరికొత్త రంగంలోకి అడుగుపెడుతున్నారు.
త్వరలోనే తానొక భారీ మీడియా సంస్థను స్థాపించబోతున్నట్లు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also:Jyotirao Phule Jayanti: పూలే ఆశయాలే మా ఎజెండా : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Vijay Sai Reddy: త్వరలోనే పేరు,లోగో
త్వరలోనే తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో వార్తలు అందించేందుకు.. డిజిటల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. తాము ప్రారంభించబోయే ఈ న్యూస్ ప్లాట్‌ఫామ్ నిష్పక్షపాతంగా, సమతుల్యంగా, వాస్తవాలకు కట్టుబడి ఉంటుందన్నారు. ప్రజల గొంతుకను వినిపిస్తూ.. సామాన్యులు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, అణగారిన వర్గాలకు సంబంధించిన సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.
తాము ప్రారంభించే మీడియా సంస్థ స్వతంత్రంగా ఉంటుందని.. ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండదన్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ లాంఛ్ చేసిన తర్వాత తెలుగులో శాటిలైట్ న్యూస్ కూడా అదే విజన్, వాల్యూస్‌తో ప్రారంభిస్తామన్నారు. ఈ మీడియా సంస్థలకు సంబంధించి పేరును త్వరలో ప్రకటిస్తానంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

