Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MIM కీలక వ్యాఖ్యలు

MIM కీలక వ్యాఖ్యలు

వార్త 3 weeks ago

MLC Mirza Issue : తెలంగాణ శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) మీర్జా రహ్మత్ బైగ్ సస్పెన్షన్ ఉదంతంపై మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (MIM) పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది.

క్రమశిక్షణారాహిత్యం మరియు ఆరోపణలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేసిన అధిష్ఠానం, వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ మాత్రమే అత్యంత ముఖ్యమని తేల్చిచెప్పింది. తీవ్రమైన ఆరోపణలు రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రహ్మత్ పై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకుని, పార్టీ నుంచి బహిష్కరించడమే కాకుండా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

ఎదురుదాడికి దిగిన ఎంఐఎం.. కాంగ్రెస్, బీజేపీలపై ప్రశ్నాస్త్రాలు

తమ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న ఇతర రాజకీయ పార్టీలకు ఎంఐఎం సవాలు విసిరింది. తమను వేలెత్తి చూపే ముందు ప్రతిపక్షాలు, అధికార పక్షం ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికింది. ఇలాంటి లైంగిక ఆరోపణలు, వివాదాస్పద వ్యవహారాలు వెలుగులోకి వచ్చినప్పుడు గతంలో కాంగ్రెస్, బీజేపీలు తమ నాయకులపై ఎలాంటి తక్షణ నిర్ణయాలు తీసుకున్నాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది. అత్తాపూర్ ప్రాంతంలో ఓ బాలికపై అత్యాచార యత్నం చేస్తుండగా స్థానిక యువకులు గమనించి దేహశుద్ధి చేశారని, ఆ దృశ్యాలను వీడియో తీశారనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ వేగవంతమైన చర్యలు చోటుచేసుకున్నాయి.

ఆయిల్‌ఫెడ్ భూమిని కాపాడండి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha