Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మండిపడ్డ ఎంపీ చామల!

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మండిపడ్డ ఎంపీ చామల!

వార్త 2 months ago

Chamala Kiran Kumar Reddy:మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది.

ఈ పరిణామంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియా వేదికగా స్పందిస్తూ కేంద్రంలోని అధికార బీజేపీపై నిప్పులు చెరిగారు. ఒక చిన్న ప్రైవేట్ కేసును సాకుగా చూపి, కావాలనే కుట్రపూరితంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించేలా చేశారని ఆయన మండిపడ్డారు.

read also: Revanth Reddy: 'భారత్ ఫ్యూచర్ సిటీ' అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

చట్టాలను తుంగలో తొక్కారు: ఎంపీ చామల విమర్శలు

బీఎన్‌ఎస్ (BNS) చట్టంలోని సెక్షన్ 230 ప్రకారం ఫామ్ 26 సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టంగా ఉన్నప్పటికీ, చట్టాలను పక్కనబెట్టి బీజేపీ ఈ అప్రజాస్వామిక చర్యకు ఒడిగట్టిందని ఎంపీ చామల ధ్వజమెత్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో పాటు ఎన్నికల సంఘాన్ని (ECI) కూడా గుప్పిట్లో పెట్టుకుని, దేశంలో ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.

“మధ్యప్రదేశ్‌లో ఉన్న బలబలాల లెక్కల ప్రకారం బీజేపీకి రెండు, కాంగ్రెస్‌కు ఒక రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది. అలాంటప్పుడు మూడో అభ్యర్థిని బీజేపీ ఎందుకు బరిలోకి దించింది? కాంగ్రెస్‌ను పోటీ నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతోనే ముందే పక్కా స్కెచ్ వేసి ఈ నామినేషన్ తిరస్కరణ డ్రామా ఆడారు.” - చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ

Chamala Kiran Kumar Reddy: బీజేపీ, బీఆర్‌ఎస్ లాలూచీ రాజకీయంపై ఫైర్

ఇదే క్రమంలో తెలంగాణ ప్రాంతీయ రాజకీయాలపై ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనూ, అటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు తెరవెనుక చేతులు కలిపాయని విమర్శించారు. ఈ రెండు పార్టీల వ్యూహాలు ఒక్కటేనని దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇక్కడి బీఆర్‌ఎస్ పార్టీ సమర్థిస్తుందా? అని ఆయన నిలదీశారు. ఇలాంటి కుటిల రాజకీయాలకు పాల్పడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, వారు ఎప్పటికీ అధికారంలోకి రాలేరని హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha