Petrol Pump Clash : కేవలం రూ.10 కోసం ప్రారంభమైన చిన్న గొడవ చివరకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయే విషాదానికి దారితీసింది. పెట్రోల్ కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తి రూ.10 తక్కువ ఇచ్చారంటూ సిబ్బంది గొడవ పడ్డారు.
ఆ వివాదాన్ని పరిష్కరించడానికి వచ్చిన వ్యక్తిపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాయచూర్ పెట్రోల్ బంక్‌లో జరిగిన ఈ ఘోర దాడి అంతా అక్కడ ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డైంది. నిందితులు మేఘనాథ్‌పై కర్రలతో ఎంత క్రూరంగా దాడి చేశారో ఈ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. పోలీసులు ఈ ఫుటేజ్‌ను కీలక సాక్ష్యంగా సేకరించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు వేగవంతం చేశారు. చిన్న కారణానికే ప్రాణాలు తీయడంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Pasumamula murder case: యువకుడి మర్మాంగాలు నలిపి హతమార్చిన స్నేహితులు
Petrol Pump Clash
Petrol Pump Clash : కర్రలతో దాడి..ఆరుగురు అరెస్ట్
ఈ క్రమంలోనే మేఘనాథ్‌ను బంక్ సిబ్బంది పక్కకు లాగి తిట్టడం ప్రారంభించారు. అక్కడితో ఆగకుండా కర్రలతో దాడి చేయడం ప్రారంభించారు. వీరేశ్ అనే వ్యక్తి మేఘనాథ్ తలపై బలంగా కొట్టాడు. వెంటనే రవి కూడా మరో కర్రతో దాడి చేయగా, నరసింహ వెను భాగంలో బలంగా కొట్టాడు. దీంతో మేఘనాథ్ స్పృహ కోల్పోయి కుప్పకూలాడు. గొడవను ఆపేందుకు వచ్చిన మహేశ్, నాగరాజ్‌లపై కూడా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మేఘనాథ్‌ను రాయచూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శస్త్రచికిత్స చేసిన కద్ది సేపటికే మృతి చెందాడు.ఈ దాడి మొత్తం పెట్రోల్ బంక్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటనపై మేఘనాథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రవి, వీరేష్, నరసింహ, మారెప్ప, రమేశ్, ప్రవీణ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

