Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీరేం విద్యార్థులు!.. స్కూల్‌కు సెలవు కోసం ఇంత పని చేస్తారా?

మీరేం విద్యార్థులు!.. స్కూల్‌కు సెలవు కోసం ఇంత పని చేస్తారా?

వార్త 3 weeks ago

Gurukula School Incident : ఆంధ్రప్రదేశ్​లోని అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లి మండలం గ్యారంపల్లెలోని బాలుర గురుకుల పాఠశాల వసతి గృహంలో దిగ్భ్రాంతికర సంఘటన వెలుగుచూసింది.

పాఠశాలకు వరుసగా సెలవులు వస్తాయనే ఉద్దేశంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తమతో ఒకే గదిలో ఉంటున్న తోటి విద్యార్థిని అంతమొందించేందుకు యత్నించారు. అర్ధరాత్రి వేళ బాధితుడి ముఖంపై దిండు గట్టిగా నొక్కిపట్టి, గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించారు. అయితే బాధిత విద్యార్థి సమయస్ఫూర్తితో వారి పట్టు నుంచి చాకచక్యంగా తప్పించుకుని బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది.

Read Also: Botsa Satyanarayana: సభలో కంటతడి పెట్టిన మాజీ మంత్రి బొత్స

 Gurukula School Incident

Gurukula School Incident :పాత సంఘటనే నేరానికి ప్రేరణ

సంఘటన వివరాలు తెలుసుకున్న ఎంఈవో రెడ్డిబాషా బుధవారం పాఠశాలను సందర్శించి సమగ్ర విచారణ చేపట్టారు. విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. సుమారు రెండేళ్ల క్రితం ఇదే పాఠశాలలో ఒక విద్యార్థి మరణించగా, అప్పట్లో బడికి కొన్ని రోజులు సెలవులు ఇచ్చారు. ఆ పాత సంఘటనను గుర్తుపెట్టుకున్న ఈ ఇద్దరు విద్యార్థులు, ఇప్పుడు కూడా ఎవరైనా చనిపోతే పాఠశాలకు సెలవు ప్రకటిస్తారని భావించి ఈ ఘాతుకానికి ప్లాన్ చేసినట్లు అంగీకరించారు. నిజానికి ఈ ఘటన జరిగిన వారం రోజుల వరకు యాజమాన్యం బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచినప్పటికీ, విషయం లీక్ కావడంతో అధికారులు స్పందించారు. నిందితులైన ఇద్దరు బాలురకు టీసీలు (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు) జారీ చేసి ఇంటికి పంపించివేశారు. కేవలం సెలవుల కోసం తోటి విద్యార్థి ప్రాణాలు తీసేందుకు పసి మనస్సులు సిద్ధపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చిన్నతనంలోనే పిల్లల్లో పెరిగిపోతున్న ప్రవర్తనాపరమైన వైపరీత్యాలు, భావోద్వేగ సమస్యలకు తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వసతి గృహాల్లో ఉండే పిల్లల మానసిక స్థితిపై ఉపాధ్యాయులు, వార్డెన్లు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

విశాఖ నుంచి బ్యాంకాక్‌కు డైరెక్ట్ ఫ్లైట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha