Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'మీర్జాపూర్: ది మూవీ'కి షాక్.. ఆ సీన్లు కట్, రన్ టైమ్ ఎంతంటే?

'మీర్జాపూర్: ది మూవీ'కి షాక్.. ఆ సీన్లు కట్, రన్ టైమ్ ఎంతంటే?

వార్త 2 weeks ago

Mirzapur The Movie: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టించిన 'మీర్జాపూర్' ఇప్పుడు 'మీర్జాపూర్: ది మూవీ'గా వెండితెరపైకి దూసుకొస్తోంది. ఈ హిట్ సిరీస్‌కు సీక్వెల్ అయిన 'మీర్జాపూర్: ది మూవీ' త్వరలో థియేటర్లలోకి రానుంది.

ఈ సినిమాలో గుడ్డు పండిట్, కాలీన్ భయ్యాల మధ్య పెరిగే ఆగ్రహంతో పాటు అనేక ఇంటిమేట్ సీన్లు కూడా ఉన్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) కొన్ని రొమాన్స్ సన్నివేశాలను సెన్సార్ చేసింది. ఈ క్రమంలో ఈ సినిమా “A” సర్టిఫికేషన్ లభించింది.

Read Also : Samantha ruth prabhu: అభిమాని చెప్పిన 'సామ్రాజ్' పేరుపై సమంత చమత్కారం

 Setback for ‘Mirzapur: The Movie’: Scenes cut-here's the runtime.

Mirzapur The Movie: అభ్యంతరకర పదాలు, సీన్ల కోత

సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు కొన్ని సీన్లను కట్ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చిత్ర నిర్మాతలను ఆదేశించింది. నాలుగు బూతు పదాలను మ్యూట్ చేయగా.. ఆరు బూతు పదాల స్థానంలో ఇతర డైలాగులను చేర్చారు. అంతేకాకుండా “గలే సే లగ్ కర్” అనే డైలాగ్‌ను కూడా మార్చారు. సినిమా ఫస్టాఫ్‌లోని ఓ అభ్యంతరకరమైన పదాన్ని మార్చారు. ‘మూర్ఖుడు’ అని అర్థం వచ్చే ‘లంఠ్’ అనే పదాన్ని కూడా విరామానంతర భాగంలో మార్చారు. అంతేకాకుండా నటీనటుల ప్రస్తావనలను మార్చమని ఆదేశాలు జారీ చేశారు.

సీన్ల కోత విషయానికొస్తే చిత్రంలోని సన్నిహిత సన్నివేశాలలో సుమారు 50 శాతం తగ్గించబడ్డాయి. కొన్ని పదాలను మార్చాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఈ సినిమాలో రెండు ఇంటిమేట్ సీన్లను తొలగించారు. ఒక ఫస్టాఫ్‌లో, రెండోది సెకండాఫ్‌లో తొలగించారు.

రక్తపాతం దృశ్యాలకు నో కట్.. నిడివి ఎంతంటే?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ హింస లేదా రక్తపాతానికి సంబంధించిన ఒక్క సన్నివేశాన్ని కూడా తొలగించలేదు. అయితే ఈ మార్పులు చేసిన తర్వాత “మీర్జాపూర్ ద మూవీ” నిర్మాతలకు సెన్సార్ సర్టిఫికేట్ మంజూరు చేయబడింది. సర్టిఫికేట్ ప్రకారం ఈ సినిమా 197.19 నిమిషాల నిడివి కలిగి ఉంది.. అంటే దీని నిడివి 3 గంటల, 17 నిమిషాల, 19 సెకన్లు.

సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్

‘మీర్జాపూర్ ద మూవీ’ విషయానికి వస్తే.. ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి , అలీ ఫజల్, దివ్యేందు, జితేంద్ర కుమార్, అభిషేక్ బానర్జీ, రసికా దుగ్గల్, మోహిత్ మాలిక్, షీబా చద్దా, శ్వేతా త్రిపాఠి, రవి కిషన్ కీలక పాత్రల్లో నటించారు. హింస, బూతు మాటలతో నిండిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్‌తో ఆమోదం తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha