Samantha ruth prabhu: నటి సమంత గర్భవతి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. సినిమాలకు కొంతకాలం విరామం తీసుకున్న ఆమె..
సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉంటున్నారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు పలు ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన చిట్‌చాట్‌లో సమంత చేసిన ఓ సరదా కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also : Toxic : 'టాక్సిక్' చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఫ్యామిలీతో చూడొద్దు - రాజాసింగ్
Samantha’s witty remark on the name ‘Samraj’ suggested by a fan.
Samantha ruth prabhu: ‘సామ్రాజ్’ పేరుపై సమంత చమత్కారం
తమకు పుట్టబోయే బిడ్డ కోసం మంచి పేర్లను సూచించాల్సిందిగా సమంత తన అభిమానులను కోరారు. దీనిపై స్పందించిన ఒక అభిమాని, పాప పుడితే ‘సమైరా’ అని, బాబు పుడితే ‘సామ్రాజ్’ అని పేరు పెట్టాలని సూచించారు. సమంత, ఆమె భర్త, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరుల పేర్లు కలిసొచ్చేలా ఆ అభిమాని ఈ పేర్లను ప్రతిపాదించడం విశేషం.
ఈ సూచనపై సమంత తనదైన శైలిలో చమత్కారంగా స్పందించారు. ముఖ్యంగా ‘సామ్రాజ్’ అనే పేరుపై బదులిస్తూ, “మన గురించి మనమే కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు అనిపించడం లేదా?” అంటూ నవ్వుతున్న ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. తన పేరులోని ‘సామ్’, రాజ్ పేరులోని ‘రాజ్’ కలిపి పెట్టిన ఈ పేరు వినడానికి కాస్త ఆత్మస్తుతిలా ఉందన్న ఉద్దేశంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్య నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
వైరల్‌గా మారిన ప్రెగ్నెన్సీ అప్‌డేట్స్
గత జూన్ నెలలో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించిన సమంత, అప్పటి నుండి గర్భధారణకు సంబంధించిన తన అనుభవాలను పంచుకుంటున్నారు. ఇప్పటికే తాను 11 కిలోల బరువు పెరిగానని ఆమె ఇటీవలే వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ సరదా వ్యాఖ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

