Dailyhunt
మిస్టర్ నాగ్స్ సరదా ప్రశ్నలు.. విరాట్ మార్క్ సమాధానాలు

మిస్టర్ నాగ్స్ సరదా ప్రశ్నలు.. విరాట్ మార్క్ సమాధానాలు

వార్త 1 week ago

Virat Kohli Mr Nags Interview: ఆర్సీబీ అభిమానులకు గత ఏడాది (ఐపీఎల్ 2025) అపురూపమైన జ్ఞాపకం. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్‌గా నిలవడంలో విరాట్ కోహ్లి పాత్ర వెలకట్టలేనిది.

తాజాగా మిస్టర్ నాగ్స్ (డానిష్ సైత్) చేసిన ఇంటర్వ్యూలో కోహ్లి తనదైన శైలిలో ట్రోలర్లకు కౌంటర్ ఇవ్వడమే కాకుండా, టైటిల్ నెగ్గినప్పటి తన భావోద్వేగాలను పంచుకున్నారు.

Read Also: Jio 195 Cricket Plan Validity Reduced: ఐపీఎల్ వేళ జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్..

ట్రోల్స్‌పై ‘కింగ్’ స్టైల్ కౌంటర్

విరాట్ కోహ్లి తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్న నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఆయనను “5వ ఓవర్సీస్ ప్లేయర్” అని పిలుస్తూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మిస్టర్ నాగ్స్ అడిగిన ప్రశ్నకు కోహ్లి చాలా స్మార్ట్‌గా స్పందించారు.”ఏమో నాకు తెలియదు. అయినా ఈ ప్రశ్న నన్నెందుకు అడుగుతున్నావ్? ఎవరైనా ఓవర్సీస్ ప్లేయర్లు ఉంటే వాళ్లని అడుగు. నేను ఓవర్సీస్ ప్లేయర్‌ని కాదు కదా!” అని నవ్వుతూనే ఆ విమర్శలను కొట్టిపారేశారు.తాను ఎక్కడ ఉన్నా భారతీయ ఆటగాడిగానే ఆడతానని, అలాంటి అర్థం లేని ట్రోల్స్‌ను తాను పట్టించుకోనని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.

Virat Kohli Mr Nags Interview: 18 ఏళ్ల నిరీక్షణ.. ఆ రాత్రి ఎమోషన్స్

ఇక ఆర్సీబీ టైటిల్ సాధించడంపై కూడా కోహ్లి స్పందించాడు. ఆర్సీబీ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఓ ఘట్టం, 18 ఏళ్ల తర్వాత తన కల నెరవేరడంపై కోహ్లి ఎమోషనల్ అయ్యాడు. “18 ఏళ్లుగా ఆ క్షణం కోసం ఎదురుచూశాను. టైటిల్ గెలిచిన ఆ రాత్రి ఎన్నో ఏళ్ల టెన్షన్, ప్రెషర్ ఒక్కసారిగా పోయిన ఫీలింగ్ కలిగింది” అని కోహ్లి ఎమోషనల్ అయ్యారు.”విజయం అంటే కేవలం ఒక ఫలితం కాదు.

మళ్లీ మరింత కష్టపడేందుకు ప్రేరణ

అది మన కష్టం, త్యాగం ,అంకితభావానికి దక్కిన ప్రతిఫలం. ఓటమి నేర్పిస్తుంది, కానీ విజయం మనం పడ్డ కష్టానికి న్యాయం చేస్తుంది” అని, చాలా మంది ఓటమి నుంచి నేర్చుకుంటారు. కానీ విజయం వస్తే మన కష్టానికి న్యాయం జరిగిన భావన కలుగుతుంది. అదే మళ్లీ మరింత కష్టపడేందుకు ప్రేరణ ఇస్తుంది” అని కోహ్లి చెప్పాడు.

కోహ్లి ప్రస్తుత ఫామ్ (IPL 2026)

ఈ సీజన్‌లో కూడా కోహ్లి భీభత్సమైన ఫామ్‌లో ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 38 బంతుల్లోనే 69 పరుగులు (5 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి ఆర్సీబీకి ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇన్నింగ్స్‌లో ఆయన స్ట్రైక్ రేట్ 181.58గా ఉండటం విశేషం.రేపు (ఆదివారం, ఏప్రిల్ 5) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరగనున్న మ్యాచ్‌లో కోహ్లి తన విశ్వరూపం చూపాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఐపీఎల్ 2026 తొలి డబుల్ హెడర్: ముంబైతో పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha